పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-834-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియమవ్రత నిష్ఠా
ణ నియుక్తాంతరంగ మధిక వై సం
రిత తపోధన దాన
స్ఫురితశ్రద్ధాను భక్తిపూర్వము గాఁగన్.

టీకా:

వర = ఉత్తమమైన; నియమ = నియమములు కల; వ్రత = వ్రతములును; నిష్ఠన్ = శ్రద్ధగా; ఆచరణ = ఆచరించుట యందు; నియుక్త = నియమింపబడిన; అంతరంగ = అంతరంగము; సమధికవు = అతిశయించిన దానవు; ఐ = అయ్యి; సంభరిత = నిండైన; తపస్ = తపస్సు అను; ధన = సంపద; దానన్ = దాని వలన; స్ఫురిత = కలిగిన; శ్రద్ధానుభక్తిన్ = శ్రద్ధానుభక్తుల; పూర్వమున్ = నిండైనది; కాగన్ = అగునట్లు.

భావము:

నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో చరించు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సును, శ్రద్ధాభక్తులతో కూడిన దానధర్మాలను ఆచరించు.