పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-832-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిట్లు వేదనాభర
ము మునుకుచుఁ బలుకఁ గర్దముఁడు మనుపుత్రిం
నుఁగొని సరసిజనయను వ
ములు మది సంస్మరించి తి కిట్లనియెన్.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; వేదనా = బాధ యొక్క; భరమునన్ = భారము నలవ; మునుకుచున్ = సంతాపము చెందుతూ; పలుకన్ = అనగా; కర్దముండు = కర్దముడు; కనుగొని = చూసి; సరసిజనయను = గోవిందుని {సరసిజ నయనుడు - సరసిజము (పద్మము) వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; వచనములున్ = ఆదేశములను; మదిన్ = మనసులో; సంస్మరించి = తలచుకొని; సతి = భార్య; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని ఈ విధంగా దేవహూతి మిక్కిలి వేదనతో పరితపిస్తూ పలుకగా, కర్దముడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకొని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఇలా అన్నాడు.