పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-828.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుతునిఁ గృపసేసి ననుఁ గావు సుజనవినుత!
ర్థి సంసార దుఃఖంబు పనయింప
ర్హుఁడవు నీవ కావె మోమున నింత
కాల మూరకపోయె నే తియు లేక.

టీకా:

అనఘ = పుణ్యుడ; సంతాన = సంతానము కలుగు; పర్యంతంబున్ = వరకు; ననున్ = నన్ను; కూడి = కలిసే; వర్తింతును = నడచుదును; అనుచున్ = అని; పూర్వమునన్ = ఇంతకు పూర్వము; పలికి = పలికి; కూతులన్ = కుమార్తెలను; ఇచ్చితి = ఇచ్చితివి; కొమరార = మనోజ్ఞమగనట్లు; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; తరుణులు = స్త్రీలు; పతులును = భర్తలును; తమకున్ = తమంతట; తార = తామే; అరసి = చూసుకొని; వర్తింతురో = పోతారేమో; అని = అని; భీతిన్ = భయమున్; పొందెదన్ = పడుతున్నాను; కావున = అందుచేత; ఈ = ఈ; పుత్రికల్ = కూతుర్ల; కున్ = కి; వరులన్ = భర్తలను; సంపాదించి = తీసుకొని వచ్చి; పరిణయంబున్ = వివాహమును; చేసి = చేసి; తత్త్వసంహితన్ = ఆత్మవిద్యను; నాకున్ = నాకు; తవిలి = పూని; తెలుపు = తెలిపెడి;
సుతునిన్ = పుత్రుని; కృపసేసి = దయచేసి; ననున్ = నన్ను; కావు = కాపాడు; సుజన = మంచివారిచే; వినుత = చక్కగ స్తుతింపబడువాడ; అర్థిన్ = కోరి; సంసార = సంసారము అను; దుఃఖంబున్ = దుఃఖమును; అపనయంబున్ = పోగొట్టుటకు; అర్హుండవు = చాలినవాడవు; నీవ = నీవే; కావె = కదా; మోహమునన్ = వ్యామోహమువలన; ఇంత = ఇంత; కాలమున్ = కాలమును; ఊరక = ఉత్తినే; పోయెన్ = గడచిపోయినది; ఏ = ఏ విధమైన; గతియున్ = మార్గమును; లేక = లేకనే.

భావము:

“ఓ పుణ్యాత్ముడా! సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం చెప్పి పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదుక్కోగలరనే భయం నాకు కలుగుతున్నది. అందుకని కుమార్తెలకు తగిన వరులను వెదకి వారికి వివాహం చేసి, నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగల కుమారుని ప్రసాదించి నన్ను కటాక్షించు. సాధుజన సంస్తవనీయా! సంసార దుఃఖాన్ని తొలగించడానికి అన్ని విధాల సమర్థుడవు నీవు. ముక్తి మార్గాన్ని తెలిపేవారు లేక మోహం వల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది.