పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-825-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివరుఁ డొకనాఁ డిమ్ములఁ
నిజదేహంబు నవవిధంబులు గావిం
చి యంబునఁ దద్వీర్యముఁ
సతిగర్భమున నవవిధంబుగ నిలిపెన్.

టీకా:

ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; ఒక = ఒక; నాడు = దినమున; ఇమ్ములన్ = అనుకూల్యముగ; తన = తన యొక్క; నిజ = స్వంత; దేహంబున్ = దేహమును; నవ = తొమ్మిది (9); విధంబులన్ = విధములుగ; కావించి = చేసి; నయంబునన్ = చక్కగా; తత్ = అతని; వీర్యమున్ = వీర్యమును; తన = తన; సతి = భార్య యొక్క; గర్భమునన్ = గర్భములో; నవ = తొమ్మిది (9); విధంబుగ = విధములుగ; నిలిపెన్ = నిలిపెను.

భావము:

మునిశ్రేష్ఠుడైన కర్దముడు ఒకనాడు కుతూహలంతో తొమ్మిది విధాలైన వేరువేరు దేహాలను ధరించి క్రమంగా తన వీర్యాన్ని తన భార్య అయిన దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు.