పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-816-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్జలముల నతి భక్తిని
జ్జన మొనరించి యీ విమానము వేడ్కన్
జ్జావతి యెక్కవె" యని
బుజ్జన మొనరంగఁ గర్దముఁడు పల్కుటయున్.

టీకా:

ఈ = ఈ; జలములన్ = నీటిలో; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మజ్జనము = స్నానము; ఒనరించి = చేసి; ఈ = ఈ; విమానమున్ = విమానమును; వేడ్కన్ = ఇష్టపూర్వకముగ; లజ్జావతి = అతివ {లజ్జావతి - లజ్జ (సిగ్గు) కలామె, స్త్రీ}; ఎక్కవే = ఎక్కుము; అని = అని; బుజ్జనము = లాలనము; ఒనరన్ = ఒప్పగా; కర్దముడు = కర్దముడు; పల్కుటయును = పలుకుటను.

భావము:

ఓ లజ్జాశీలీ! ఈ సరోవర జలాలలో భక్తితో స్నానం చేసి సంతోషంగా ఈ విమానాన్ని ఎక్కు” అని కర్దముడు బుజ్జగిస్తూ పలికాడు.