పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-814-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అగుచు నొప్పు దివ్యవిమానంబుఁ గల్పించి తదీయ సుషమావిశేష విచిత్రంబులు నిర్మించిన తానునుఁ దెలియంజాలని యద్భుతకర్మంబు లైన విమానంబు దేవహూతికిం జూపినం జూచి యమ్ముద్దియ సంతసింపకుండుట యెఱింగి సర్వభూతాంతరాశ యాభిజ్ఞుండును సంతుష్టాంతరంగుండును నైన గర్దముం డిట్లనియె.
^కర్దముని విమాన విశేషాలు

టీకా:

అగుచున్ = అవుతూ; ఒప్పు = చక్కగ ఉండే; దివ్య = గొప్ప; విమానంబున్ = విమానమును; కల్పించి = సృష్టించి; తదీయ = దాని యందు; సుషమా = మనోజ్ఞమైన; విశేష = ప్రతేకతలు; విచిత్రంబులున్ = విచిత్రములును; నిర్మించిన = సృష్టించిన; తానునున్ = తాను కూడ; తెలియన్ = తెలిసికొన; చాలని = లేని; అద్భుత = ఆశ్చర్య; కర్మంబులు = పనులు; ఐన = కలిగిన; విమానంబున్ = విమానమును; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; చూపి = చూపించి; ఆ = ఆ; ముద్దియ = అమాయకురాలు; సంతసింపక = సంతోషించకుండ; ఉండుట = ఉండుట; ఎఱింగి = తెలిసికొని; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; అంతర = లోని; ఆశయ = మక్కువలను; అభిజ్ఞుండు = అర్థము చేసికొనువాడు; సంతుష్ట = సంతృప్తి చెందిన; అంతరంగుండు = మనసుకలవాడు; ఐన = అయినట్టి; కర్దముండు = కర్దముడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అటువంటి దివ్యమైన విమానాన్ని సృష్టించి, అందలి శోభావిశేషాలను నిర్మాణం చేసిన తాను కూడా తెలుసుకొనంతటి అద్భుత నిర్మాణాలు కలదానిని దేవహూతికి చూపి, ఆమె సంతోషించడం లేదని తెలిసికొని సమస్త ప్రాణుల అంతరంగాలలో గల అభిప్రాయాలను గ్రహించేవాడూ, తృప్తిపడిన మనస్సు కలవాడూ అయిన కర్దముడు ఇలా అన్నాడు.