పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-812-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సౌధాంతర శయ్యా
కేళీగేహ కృతక గతీధర శో
చంద్రకాంత చారు భ
ఫలభరితావనీజవంతము లగుచున్.

టీకా:

ఘన = పెద్ద; సౌధ = మేడల; అంతర = లోపల; శయ్య = పడకలు; ఆసన = ఆసనములు; కేళీ = క్రీడా; గేహ = గృహములు; కృతక = కృత్రిమ; జగతీధరన్ = పర్వతములతో [జగతీధరము – జగత్తును ధరించునవి, పర్వతములు, పర్యా. క్ష్మాధరములు, ధాత్రీధరములు, అవనీదరములు]; శోభనన్ = శోభిల్లుట కల; చంద్రకాంత = చలువరాళ్ళ; చారు = అందమైన; భవన = భవనములును; ఫల = పండ్లతో; భరిత = నిండిన; అవనీజ = చెట్లును {అవనీజములు - అవని (భూమి) యందు జములు (పుట్టినవి), చెట్లు}; వంతములు = కలవి; అగచున్ = అవుతూ.

భావము:

ఆ విమానం మెత్తని శయ్యలతో, మేలైన గద్దెలతో, కేళీగృహాలతో, క్రీడాపర్వతాలతో, పాలరాతి భవనాలతో, పండ్లచెట్లతో నిండిన వనాలతో కూడి ఉన్నది.