పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-810-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితోద్యానవనాంత సంచరణలీలాలోల హంసాళి కో
కి పారావత చక్రవాక శుక కేకీవ్యూహ మంచత్సము
త్కలికం గృత్రిమపక్షులన్ నిజవిహంశ్రేణి యంచుం గుతూ
లి యై పల్కుచు నాడుచుండుఁ బ్రతిశాఖారోహణవ్యాప్తులన్.

టీకా:

లలిత = అందమైన; ఉద్యాన = ఉద్యాన; వన = వనముల; అంత = లోపల; సంచరణ = సంచరిస్తూ; లీలన్ = విలాసముగ; ఆలోల = తిరుగుతున్న; హంస = హంసల; ఆళి = వరుసలును; కోకిల = కోకిలలు; పారావత = పావురములును; చక్రవాక = చక్రవాకములును; శుక = చిలుకలును; కేకి = నెమళ్ళ; వ్యూహమున్ = బారులతోటి; అంచత్ = రచింపబడిన; సముత్కలికన్ = చక్కటి ఉత్సాహముగ; కృత్రిమ = చేయబడిన బొమ్మల; పక్షులన్ = పక్షులతో; నిజ = నిజమైన; విహంగ = పక్షుల; శ్రేణిన్ = సమూహము; అంచున్ = అనుకొనుచూ; కుతూహలి = కుతూహలము కలవి; ఐ = అయ్యి; పల్కుచున్ = కూయుచూ; ఆడుచున్ = ఆడుతూ; ఉండున్ = ఉండును; ప్రతి = అన్ని; శాఖా = కొమ్మలపైకి; ఆరోహణ = ఎక్కుట; వ్యాప్తులన్ = పొందుటలో.

భావము:

అందలి అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్ళు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమ పక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడి చెట్లకొమ్మలపై కేరింతలు కొడుతూ ఆడుతుంటాయి.