పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-806-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమ రాజ్యదర్పాంధచేతస్కు లై-
పాపవర్తను లైన పార్థివులకు
ధృతిఁ బొందరాని యీ దివ్యభోగంబులు-
నీదు పాతివ్రత్యనిష్ఠఁ జేసి
సంప్రాప్తములు నయ్యె మత భోగింపుము-
కార్యసిద్ధియు నగుగాక నీకు"
నుటయు నతివయు నుపమ యోగమా-
యా విచక్షణవిభుండైన కర్ద

3-806.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిఁ గనుంగొని విగతాధియును నపాంగ
లిత లజ్జానతాస్యపంజయు నగుచు
వినయ సౌహార్దములఁజేసి విహ్వలంబు
యిన పలుకులఁ బతికి నిట్లనియెఁ బ్రీతి.

టీకా:

అనుపమ = సాటిలేని; రాజ్య = రాజ్య సంపదతో కలిగిన; దర్ప = గర్వము వలన; అంధ = గుడ్డిదైన; చేతస్కులు = మనసుకలవారు; ఐ = అయ్యి; పాప = పాపపు; వర్తనులు = నడతలు కలవారు; ఐనన్ = అయినట్టి; పార్థివుల్ = రాజులు {పార్థివులు - పృథు (భూమి)కి ప్రభువులు, రాజులు}; ధృతిన్ = కష్టపడినను; పొందరాని = పొందలేని; ఈ = ఈ; దివ్య = గొప్ప; భోగంబులున్ = భోగములను; నీదు = నా యొక్క; పాతివ్రత్య = పాతివ్రత్యము యొక్క {పాతివ్రత్యము - పతియే వ్రతము (నియమము)గ కలిగి నడచుట}; నిష్ఠన్ = నేర్పు; చేసి = వలన; సంప్రాప్తములు = చక్కగా లభించినవి; అయ్యెన్ = అయినవి; సమతన్ = చక్కగ; భోగింపుము = అనుభవించుము; కార్యసిద్ధియునున్ = సార్థకతయును; అగున్ = కలుగు; కాక = గాక; నీకున్ = నీకు; అనుటయున్ = అని పలికిన; అతివయున్ = ఆమెకూడ; అనుపమ = సాటిలేని; యోగమాయా = యోగమాయ యందు; విచక్షణ = మిక్కిలినేర్పు ఉండుటలో; విభుండు = శ్రేష్ఠుడు; ఐనన్ = అయినట్టి; కర్దమునిన్ = కరందముని; కనుంగొని = చూసి;
విగత = పోయిన; ఆధియును = వ్యధ కలదియును; అపాంగ = కడకంట; కలిత = కలిగిన; లజ్జ = సిగ్గుచే; ఆనత = వంచిన; అస్య = శిరస్సు అను; పంకజయున్ = పద్మము కలదియును; అగుచూ = అవుతూ; వినయ = వినమ్రతయును; సౌహార్థములన్ = చనువుల; చేసి = వలన; విహ్వలంబుల్ = పరవశమైనది; అయిన = అయినట్టి; పలుకులన్ = మాటలతో; పతి = భర్త; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమతో.

భావము:

సాటిలేని రాజ్యవైభవాలతో గర్వాంధులైన రాజులు కనులు గానక పాపమార్గంలో ప్రవర్తిస్తారు. అటువంటి వారికి అందరాని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమ వల్ల నీకు లభించాయి. ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది” అని కర్దముడు పలుకగా దేవహూతి కడకన్నులలో సిగ్గు చిందులు త్రొక్కగా, మనోవ్యథ మాయం కాగా, మోము వంచుకొని వినయంతో చనువుతో పారవశ్యంతో యోగమాయావిశారదుడైన తన భర్తవంక చూస్తూ ముద్దుముద్దుగా ఇలా అన్నది.