పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-802-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యమ్మనుచరితము విదు
రు కమ్మైత్రేయమునివరుఁడు దయతోడన్
వినిపించి కర్దమునికథ
రఁగ నెఱిఁగింతు నని ముదంబునఁ బలికెన్.

టీకా:

అని = అని; ఆ = ఆ; మను = మనువు యొక్క; చరితము = కథ; విదురున్ = విదురురుని; కున్ = కి; ఆ = ఆ; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; దయ = కృప; తోడన్ = తో; వినిపించి = చెప్పి; కర్ధముని = కర్దముని; కథ = కథ; తనరగన్ = విజృంభించి; ఎఱిగింతున్ = తెలిపెదను; అని = అని; ముదంబునన్ = ముదంబునన్; పలికెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా విదురునికి మైత్రేయుడు దయతో స్వాయంభువ మనువు చరిత్రను వినిపించి “కర్దముని కథను వివరిస్తాను” అని సంతోషంగా చెప్పాడు.