పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-801-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నమ్మేటి విష్ణుమంగళకథా-
ర్ణన ధ్యానానుగాన నుతులు
లుపుచు స్వస్వప్న జాగ్రత్సుషుప్తులఁ-
లఁగించి యా పుణ్యముఁడు దాను
క్రిదాసుఁడు గాన శారీర మానస-
దివ్యమానుష భౌతివ్యధలను
గులక సన్మునీంద్రశ్రేణికిం దగఁ-
నరు వర్ణాశ్రమర్మగతులు

3-801.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పకుండంగ నడపుచుఁ గిలి సర్వ
భూహితవృత్తి నతుల విఖ్యాలీల
నేసప్తతియుగము లస్తోచరితుఁ
గుచు వర్తించె సమ్మోద తిశయిల్ల."

టీకా:

వెండియున్ = ఇంకను; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; విష్ణు = గోవిందుని; మంగళ = శుభకరమైన; కథా = కథలను; ఆకర్ణన = వినుట; ధ్యాన = ధ్యానము; అనుగాన = భజనలు; నుతులు = స్తోత్రములు; సలుపుచున్ = చేస్తూ; స్వ = తన; స్వప్న = స్వప్నావస్థ; జాగ్రత్ = జాగ్రదవస్థ; సుషుప్తలన్ = సుషుప్తావస్థలను; తలగించి = తొలగించుకొని; ఆ = ఆ; పుణ్యతముడు = అత్యంతపుణ్యుడు {పుణ్యుడు - పుణ్యతరుడు - పుణ్యతముడు}; తానున్ = తను; చక్రి = విష్ణుమూర్తి యొక్క; దాసుడు = సేవించువాడు; కాన = కనుక; శారీర = శరీర సంబంధమైన; మానస = మానసికమైన; దివ్య = ఆదిదైవిక; మానుష = ఆధ్యాత్మిక; భౌతిక = ఆదిభౌతిక; వ్యధలనున్ = బాధలందు; తగులక = చిక్కుకొనక; సత్ = మంచి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; శ్రేణిన్ = సమూహమున; కిన్ = కి; తగన్ = తగి; తనరు = అతిశయించు; వర్ణ = వర్ణముల; ఆశ్రమ = ఆశ్రమముల; ధర్మ = ధర్మముల; గతులు = విధానములు; తప్పకుండగ = తేడాలురాకుండా;
నడపుచున్ = నడిపిస్తూ; తగిలి = చక్కగ; సర్వ = సమస్తమైన; భూత = ప్రాణులకు; హిత = మేలుచేయు; వృత్తిన్ = ప్రవర్తనతో; అతుల = సాటిలేని; విఖ్యాత = ప్రసిద్ధిచెందిన; లీలన్ = విధముగ; ఏకసప్తతి = డెబ్బయిఒక్క; యుగముల్ = యుగములు; అస్తోక = అనల్ప; చరితుడు = ప్రవర్తన కలవాడు; అగుచున్ = అవుతూ; వర్తించెన్ = జీవించెను; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = పెంపొందగా.

భావము:

ఆ స్వాయంభువ మనువు విష్ణువు దివ్యమంగళ చరిత్రలను వింటూ, ఆయన రూపాన్ని ధ్యానిస్తూ, ఆయన లీలలను గానంచేస్తూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వప్న, జాగ్రత్, సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. విష్ణుభక్తుడు కనుక శరీరానికి, మనస్సుకు సంబంధించిన వ్యథలను పొందలేదు. దేవతలవల్లా, మానవులవల్లా, పంచభూతాలవల్లా కలిగే బాధలలో చిక్కుకోలేదు. ఉత్తములైన మునీశ్వరులకు సంతోషం కలిగేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా నడుపుతూ, సర్వప్రాణులకు మేలు చేస్తూ డెబ్బైయొక్క మహాయుగాలు పాలించాడు. సమ్మోదంతో, సాటిలేని మేటి యశస్సుతో సచ్చరిత్రుడై విరాజిల్లాడు.