పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-798-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి భక్తిం బ్రతివాసరంబును హరివ్యాసంగుఁ డై మాధవాం
కి గంధర్వ విపంచికా కలిత సంగీతప్రబంధానుమో
దితుఁ డై యిష్ట విభూతు లందు ననురక్తిం బొంద కేప్రొద్దు న
చ్యు సేవైకపరాయణుం డగుచు నస్తోకప్రభావోన్నతిన్

టీకా:

అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; ప్రతి = ప్రతి; వాసరంబునున్ = దినమును; హరి = విష్ణుమూర్తి యందు; వ్యాసంగుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; మాధవ = విష్ణుమూర్తి యందు; అంకిత = అర్పించిన; గంధర్వ = గంధర్వ; విపంచి = వీణతో; కలిత = కూడిన; సంగీత = సంగీతములతోను; ప్రబంధ = కావ్యములతోను; అనుమోదితుండు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ఇష్ట = కోరదగిన, అష్టఇష్టులు {అణిమాది - అష్టసిద్ధులు - అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). 1 అణిమ - అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ - పెద్దగ అగుట, 3 గరిమ - బరువెక్కుట, 4 లఘిమ - తేలికగనౌట, 5 ప్రాప్తి - కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము - కోరిక తీర్చుట, 7 ఈశత్వము - ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము - వశీకరణము చేయగలుగుట}; విభూతులు = సంపదలు; అందున్ = అందు; అనురక్తిన్ = ఆపేక్షను; పొందక = లేకుండగ; ఏ = ఏ; పొద్దునన్ = సమయములోనైనా; అచ్యుత = విష్ణుమూర్తిని; సేవ = కొలుచుట; ఏక = మాత్రమే; పారాయణుండు = నియమముగ కలవాడు; అగుచున్ = అవుతూ; అస్తోక = అనల్ప; ప్రభావ = మహిమ యొక్క; ఉన్నతిన్ = గొప్పదనముతో;

భావము:

అతడు ప్రతిదినం మిక్కిలి భక్తితో విష్ణువునందే మనస్సు నిల్పి, గంధర్వవీణను మేళవించి విష్ణువున కంకితంగా కమ్మని గీతాలను గానం చేస్తూ సంతుష్టాంతరంగుడై భోగభాగ్యాల మీద ఆసక్తి లేనివాడై, సర్వదా నారాయణ సేవాపరాయణుడై అనంత మహిమాన్వితుడైనాడు.