పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-796-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డాయంజనఁ బురజనము లు
పానములు దెచ్చియిచ్చి హుగతుల నుతుల్
సేయఁగ మంగళతూర్యము
లాతగతి మ్రోయఁ జొచ్చె నంతఃపురమున్.

టీకా:

డాయన్ = దగ్గరకు; చనన్ = వెళ్ళగా; పురజనములు = పౌరులు; ఉపాయనములు = కానుకలు; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చి = ఇచ్చి; బహు = అనేక; గతులన్ = విధములుగ; నుతుల్ = స్తోత్రములు; సేయగన్ = చేయగా; మంగళతూర్యముల్ = మంగళవాద్యములు; ఆయత = పెద్దవైన; గతిన్ = విధముగ; మ్రోయన్ = మోగ; చొచ్చెన్ = సాగెను; అంతఃపురమున్ = అంతఃపురమును.

భావము:

ఆ విధంగా తన పట్టణాన్ని సమీపించగా పురజనులు కానుకలను తెచ్చి ఇచ్చి అనేక విధాలుగా స్తుతిస్తుండగా, మంగళవాద్యాలు మ్రోగుతుండగా స్వాయంభువ మనువు తన అంతఃపురం ప్రవేశించాడు.