పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-791-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీవిభునివలన నీ లో
కాళి యుదయించుఁ బెరుఁగు డఁగును విను రా
జీ భవాదుల కతడే
భూర! నిర్మాణహేతుభూతుం డరయన్.

టీకా:

శ్రీవిభుని = విష్ణుమూర్తి {శ్రీవిభుడు - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి విభుడు, విష్ణువు}; వలనన్ = వలన; ఈ = ఈ; లోక = లోకముల; ఆవళి = సమస్తమును; ఉదయించున్ = సృష్టింపబడును; పెరుగున్ = పెరుగును; అడగున్ = నాశనమగును; విను = వినము; రాజీవభవ = బ్రహ్మదేవుడు {రాజీవ భవుడు - రాజీవము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆదుల్ = మొదలగువారి; కున్ = కి; అతడే = అతడే; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు (భర్త), రాజు}; నిర్మాణ = సృష్టికి; హేతుభూతుడు = కారణమాత్రుడు; అరయన్ = తరచి చూసినచో.

భావము:

ఓ రాజా! విష్ణువు వల్లనే లోకాలన్నీ పుట్టి, పెరిగి, నశిస్తాయి. బ్రహ్మాదుల కతడే కారణభూతుడై ఉన్నాడు.