పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-789-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలాత్మ! దీని కొక సమ
ము గల దెఱిఁగింతు విను గుణాకర యగు నీ
ణికి నపత్యపర్యం
ము వర్తింపుదు గృహస్థర్మక్రియలన్.

టీకా:

విమల = నిర్మల; ఆత్మా = మూర్తీ; దీని = దీని; కిన్ = కి; ఒక = ఒక; సమయము = నియమము; కలదు = ఉన్నది; ఎఱిగింతున్ = తెలిపెదను; విను = వినుము; గుణ = సుగుణములకు; ఆకర = నివాసము; అగున్ = అయిన; ఈ = ఈ; రమణి = స్త్రీ {రమణి - రమ్యము (మనోహరము) ఐనామె, స్త్రీ}; కిన్ = కి; అపత్య = సంతానము కలుగకుండగ; పర్యంతము = ఉండు వరకు; వర్తింపుదున్ = నడచెదను; గృహస్థధర్మ = గృహస్థ ధర్మముల {చాతుర్ధర్మములు - 1బ్రహ్మచర్యములు 2గృహస్థధర్మములు 3వానప్రస్థధర్మములు 4 సన్యాసధర్మములు}; క్రియలన్ = ప్రకారముగ.

భావము:

ఓ పుణ్యాత్మా! దీనికొక నియమం ఉంది. అది చెపుతాను విను. గుణవతియైన ఈమెకు సంతానం కలిగేవరకు మాత్రమే నేను గృహస్థధర్మాన్ని నిర్వర్తిస్తాను.