పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-788-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్యారత్నమునకు
నాకును గుణరూపవర్తనంబుల యెడ నా
లోకింప సమమ కావునఁ
గైకొని వరియింతు విగతల్మషవృత్తిన్.

టీకా:

ఈ = ఈ; కన్యా = కన్యలలో; రత్నమున్ = మణి; కున్ = కిని; నాకున్ = నాకును; గుణ = గుణములలోను; రూప = రూపములోను; వర్తనంబులు = ప్రవర్తనలు; ఎడన్ = అందును; ఆలోకింపన్ = తరచిచూసిన; సమమ = సమానముగా ఉన్నవి; కావునన్ = అందుచేత; కైకొని = చేపట్టి; వరియింతున్ = పెండ్లాడెదను; విగత = వదలిపోయిన; కల్మష = పాపపు; వృత్తిన్ = వర్తనతో.

భావము:

గుణం, రూపం, నడవడి ఈ కన్యామణికి, నాకు సమానంగా ఉన్నాయి. కనుక ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను వరించి స్వీకర్తిస్తాను.