పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-787-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు
లీ తలోదరిఁ బొడగాన రేమిసెప్ప
ట్టి కొమరాలు భాగ్యోదమునఁ దాన
చ్చి కామింప నొల్లనివాఁడు గలఁడె.

టీకా:

పుండరీకాక్షునిన్ = హరిని {పుండరీ కాక్షుడు - పుండరీకముల వంటి కన్నులు కలవాడు}; ఎఱుగని = తెలియని; పురుష = నరులలో; పశువులు = జంతువుల వంటి వారు; ఈ = ఈ; తలోదరిన్ = స్త్రీని {తలోదరి - తల (శిరోజములు) ఉదారముగ (అధికముగా) కలది, స్త్రీ}; పొడగానరు = చూడలేరు; ఏమి = ఏమి; చెప్పన్ = చెప్పను; అట్టి = అటువంటి; కొమరాలు = యువతి {కోమరాలు - కొమరము (యౌవనము)న ఉన్నామె, యువతి}; భాగ్య = అదృష్టము; ఉదయమునన్ = కలసివచ్చుటచే; తానన్ = తానే; వచ్చి = వచ్చి; కామింపన్ = కోరగా; ఒల్లనివాడు = వద్దనువాడు; కలడె = ఉంటాడా ఏమిటి.

భావము:

విష్ణువును తెలిసికొనని పురుష పశువులు ఈమెను చూడలేరు. ఏం చెప్పను? అటువంటి జవరాలు అదృష్టవశాన తనంత తాను వలచినప్పుడు కోరుకొననివాడు ఉంటాడా?