పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-786-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నఘ! నీచేత నన్యదత్తముగఁ బ్ర-
తిష్ఠితంబైన యీ తీవబోఁడి
మనీయరూపరేఖావిలాసంబుల-
మానితలక్ష్మీసమాన యగుచు
నొకనాఁటి రాత్రి యం దుడురాజచంద్రికా-
వళిత నిజ సౌధలము నందు
హిత హిరణ్మయ మంజీర శోభిత-
రణ యై నిజ సఖీ హిత యగుచుఁ

3-786.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గందుకక్రీడఁ జరియింప గన మందు
రవిమానస్థుఁ డగుచు విశ్వావసుండు
నాఁగఁ దనరిన గంధర్వనాయకుండు
రుణిఁ జూచి విమోహియై రణిఁ బడియె.

టీకా:

అనఘ = పుణ్యుడా; నీ = నీ; చేతన్ = చేత; అనన్యదత్తమునగన్ = ఇతరులకిచ్చినది కాదని {అనన్యదత్తము - అన్యదత్తము (ఇతరులకిచ్చినది) కానిది}; ప్రతిష్టింపబడినది = స్థిరీకరింపబడినది; ఐన = అయిన; ఈ = ఈ; తీవబోడిన్ = అందగత్తెను {తీవబోడి - పూలతీగ వంటి దేహము కలామె, అందగత్తె}; కమనీయ = మనోహరమైన; రూప = అందము; రేఖ = చందము; విలాసంబులన్ = విలాసములతో; మానిత = గౌరవింపతగిన; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాన = సమానురాలు; అగుచున్ = అవుతూ; ఒక = ఒక; నాటి = దినము; రాత్రి = రాత్రి; అందున్ = అందు; ఉడురాజు = చంద్రుని; చంద్రికా = వెన్నెలలో; ధవళిత = తెల్లనైన; నిజ = తన యొక్క; సౌధ = మేడ; తలమునన్ = మీది స్థలము; అందున్ = అందు; మహిత = గొప్ప; హిరణ్మయ = బంగారపు; మంజీర = గజ్జలపట్టీతో; శోభిత = సొగసైన; చరణ = పాదములుకలది; ఐ = అయ్యి; నిజ = తన; సఖీ = స్నేహితురాళ్లతో; సహిత = కూడినది; అగుచున్ = అవుతూ; కందుక = బంతి; క్రీడన్ = ఆట; చరియింపన్ = ఆడుతుండగా;
గగనము = ఆకాశము; అందున్ = అందు; వర = ఉత్తమ; విమానస్థుండు = విమానమున ఉన్నవాడు; అగుచున్ = అవుతూ; విశ్వావసుండు = విశ్వావసుడు; నాగన్ = అనబడెడి; తనరిన = అతిశయించిన; గంధర్వ = గంధర్వుల; నాయకుండు = నాయకుడు; తరుణిన్ = (ఈ) స్త్రీని; చూచి = చూసి; విమోహి = బాగుగా మోహమునపడినవాడు; ఐ = అయ్యి; ధరణిన్ = భూమిపైన; పడియెన్ = పడిపోయెను.

భావము:

“ఓ పుణ్యాత్మా! అన్యులను కాదని నాకోసం తీసుకొని వచ్చిన ఈ లతాంగి అందచందాలలో మహాలక్ష్మితో సమానురాలై ఒకనాటి రాత్రి చంద్రుని వెన్నెలతో మెరుస్తున్న తన మేడపై పాదాలకు బంగారు అందెలు అలంకరించుకొని చెలికత్తెలతో ఆడుకొంటుండగా ఆకాశంలో విమానంలో వెళ్తున్న విశ్వావసుడనే గంధర్వరాజు ఈమెను చూచి మోహంతో తూలి నేలపైన పడ్దాడు.