పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-781-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"యోగీశ్వర! దేవహూతి యను నీ వామాక్షి మత్పుత్రి దా
లావణ్య గుణాఢ్యులన్ వినియు నెవ్వారిన్ మదిం గోర కా
తుయై నారదు పంపునన్ మిము వరింతున్నంచు నేతెంచె నీ
రుణీభిక్షఁ బరిగ్రహింపుము శుభోదాత్తక్రియాలోలతన్.

టీకా:

వర = ఉత్తమమైన; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠమైనవాడ; దేవహూతి = దేవహూతి; అనున్ = అనెడి; ఈ = ఈ; వామాక్షి = చక్కని కన్నులు ఉన్నామె; మత్ = నా యొక్క; పుత్రి = పుత్రిక; తాన్ = ఆమె, తాను; వర = ఉత్తమమైన; లావణ్య = లావణ్యము; గుణ = గుణములు అను; ఆఢ్యులన్ = సంపదలు కలవారిని; వినియున్ = విన్నప్పటికిని; ఎవ్వారినిన్ = ఎవరినీ; మదిన్ = మనసున; కోరక = కోరుకోకుండ; ఆతుర = ఆతృత కలామె; ఐ = అయ్యి; నారదున్ = నారదుని యొక్క; పంపునన్ = ఆజ్ఞానుసారము; మిమున్ = మిమ్ములను; వరింతున్ = పెండ్లాడెదను; అని = అని; అంచున్ = అంటూ; ఏతెంచెన్ = వచ్చినది; ఈ = ఈ; తరుణీ = స్త్రీ అను {తరుణి - తరుణ (తగిన) వయసున ఉన్న స్త్రీ}; భిక్షన్ = భిక్షను; పరిగ్రహింపుము = స్వీకరింపుము; శుభ = శుభకరమైన; ఉదాత్త = గొప్ప; క్రియా = పనులందు; లోలతన్ = ఆసక్తితో.

భావము:

“ఓ మహాయోగీశ్వరా! దేవహూతి అనే ఈ కన్యక నా కూతురు. ఈమె లోకంలో మిక్కిలి సౌందర్యవంతులైన పురుషులను ఎవ్వరినీ వరించడానికి ఇష్టపడక, చింతాక్రాంతురాలై, నారద మహర్షి వల్ల నీ రూపగుణాలను విని నిన్నే వివాహమాడాలని వచ్చింది. అందుకని నీవు ఈ శుభకార్యానికి అంగీకరించి నా కుమార్తెను స్వీకరించు.