పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-775-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిం బోలెఁ జరింపకున్న ఘననిద్రం బొంది యెందేని భూ
! పద్మోదరకల్పితంబు లగు నీ ర్ణాశ్రమోదార వి
స్త పాథోనిధిసేతుభూతమహిమాచారక్రియల్ తప్పి సం
మై చోరభయంబునన్ నిఖిల లోకంబుల్ నశించుం జుమీ."

టీకా:

తరణిన్ = సూర్యుని; పోలెన్ = వలె; చరింపక = తిరుగకుండగ; ఉన్నన్ = ఉన్నచో; ఘన = గాఢమైన; నిద్రన్ = నిద్రను; పొంది = పొంది; ఎందేనిన్ = ఎక్కడైననూ; భూవర = రాజా {భూవరుడు - భూమికి వరుడు (ప్రభువు), రాజు}; పద్మోదరు = బ్రహ్మదేవునిచే; కల్పితంబులున్ = సృష్టింపబడినవి; అగు = అయిన; ఈ = ఈ; వర్ణా = వర్ణముల ధర్మములు {వర్ణములు - చాతుర్వర్ణములు, 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = ఆశ్రము ధర్మములు అను {ఆశ్రమములు - చతురాశ్రమములు, 1బ్రహ్మచర్యము 2గార్హస్తము 3వానప్రస్తము 4సన్న్యాసము}; ఉదార = మహా; విస్తార = విస్తారమైన; పాథోనిధి = సముద్రమునకు {పాథోనిధి - పాథస్ (జలము)నకు నిధి (ఆవాసము) వంటిది, సముద్రము}; సేతు = ఆనకట్ట; భూత = వంటి; మహిమ = గొప్ప; ఆచార = ఆచారముల {ఆచారములు - విధినిషేధములు}; క్రియల్ = విధానములు; తప్పి = తప్పిపోయి; సంకరము = కలుషితము; ఐ = అయ్యి; చోర = దొంగల; భయంబునన్ = భయముతో; నిఖిల = సమస్తమైన; లోకంబుల్ = లోకములును; నశించున్ = నాశనమైపోవును; చుమీ = సుమీ.

భావము:

ఓ రాజా! నీవు ఈ జగత్తులో సూర్యునివలె సంచరించకపోతే ఈ లోకాలన్నీ నిద్రలో మునిగి, బ్రహ్మచే కల్పించబడిన వర్ణాశ్రమాలు అనే సముద్రం అల్లకల్లోలమై, సేతువువంటి సదాచార సంపద సంకరమై పోతుంది. జాతి సాంకర్యం ఏర్పడి దొంగల భయంవల్ల లోకాలన్నీ నశించిపోతాయి.