పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-774.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! నీ వెప్పుడేనేమి ఖిలలోక
జైత్ర మగు హేమమణిమయ స్యందనంబు
నెక్కి కోదండపాణివై యిద్ధ సైన్య
దవిఘట్టనచే భూమిభాగ మగల.

టీకా:

వర = శ్రేష్ఠమైన; గుణ = గుణములకు; ఆకర = నివాసమైనవాడ; భగవత్ = భగవంతునిఎడల; భక్తి = భక్తి; యుక్తుడవు = కలిగినవాడవు; ఐన = అయినట్టి; త్వదీయ = నీ యొక్క; పర్యటనము = ప్రయాణములు చేయుట; ఎల్లన్ = అంతయు; శిష్ట = మంచివారిని; పరిగ్రహ = ఆదరించుట; దుష్ట = చెడ్డవారిని; నిగ్రహముల = శిక్షించుట; కొఱకున్ = కోసమై; కదా = కదా; పుణ్యపురుష = పుణ్యాత్ముడా; మఱియున్ = ఇంకను; వనజహితాహిత = సూర్యచంద్రులు {వనజహితాహితులు - వనజ (పద్మము)నకు హిత (ఇష్టుడు, సూర్యుడు) అహిత (అయిష్టుడు, చంద్రుడు)}; వహ్ని = అగ్నిహోత్రుడు; సమీర = వాయుదేవుడు; వైవస్వత = యముడు; వార్ధిప = వరుణుడు {వార్ధిపుడు - వార్ధి (సముద్రము)నకు ప్రభువు, వరుణుడు}; వాసవ = ఇంద్రుల యొక్క; ఆత్మకుండవు = అంశలు కలవాడవు; హరి = మహావిష్ణువు యొక్క; స్వరూపుడవు = రూపమైనవాడవు; ఐన = అయినట్టి; నీకున్ = నీకు; మానిత = మన్ననపూర్వక; భక్తిన్ = భక్తితో; నమస్కరింతున్ = నమస్కారము చేసెదను; అనఘ = పుణ్యుడా;
నీవు = నీవు; ఎప్పుడేనేమి = ఎప్పుడైతే; అఖిల = సమస్తమైన; లోక = లోకములను; జైత్రము = జయించునది; అగు = అయిన; హేమ = బంగారము; మణి = మణులతో; మయ = నిండిన; స్యందనంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; కోదండ = విల్లును; పాణి = చేతబట్టినవాడవు; ఐ = అయ్యి; ఇద్ధ = ప్రసిద్ధమైన; సైన్య = సైన్యము యొక్క; పద = అడుగుల; ఘట్టన = తాకిడి; చేన్ = చేత; భూమి = భూమి యొక్క; భాగము = భాగము; అగలన్ = అదురునట్లు.

భావము:

ఉత్తమ గుణాలకు స్థానమైన రాజా! భగవద్భక్తుడవైన నీవు దుర్జనులను శిక్షించడానికి, సజ్జనులను రక్షించడానికి లోకంలో పర్యటిస్తూ ఉంటావు. ఓ పుణ్యపురుషా! నీవు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, ఇంద్రుల అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అటువంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ సమస్త లోకాలలో విజయాన్ని సంపాదించే మణులు పొదిగిన బంగారు రథమెక్కి, విల్లు ధరించి, వీర సైనికుల పదఘట్టనలతో భూమి దద్దరిల్లగా జైత్రయాత్ర సాగిస్తుంటావు.