పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-773-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వందనంబు గావించినం గర్దముండు దన గృహంబునకు విందై చనుదెంచిన యమ్మనువు నాదరించి; యర్ఘ్యపాద్యాది విధులం బరితుష్టునిం గావించి; పూర్వోక్తంబైన భగవదాదేశంబు సంస్మరించి స్వాయంభువున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వందనంబున్ = నమస్కారము; కావించినన్ = చేయగా; కర్దముండు = కర్దముడు; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; విందు = భోజనమున; ఐ = కై; చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; మనువున్ = మనువును; ఆదరించి = ఆదరించి; అర్ఘ్య = చేతులు కడుగుకొను నీరు; పాద్య = పాదములను కడుగుకొనుటకు నీరు ఇచ్చటలు అను; విధులను = పనులతో; పరితుష్టునిన్ = సంతుష్టుడిని; కావించి = చేసి; పూర్వ = ముందుగ; ఉక్తంబున్ = చెప్పబడినది; ఐన = అయిన; భగవత్ = భగవంతుని; ఆదేశంబున్ = ఆజ్ఞను; సంస్మరించి = గుర్తుచేసుకొని; స్వాయంభువున్ = స్వాయంభువుని; కిన్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా నమస్కరించగా కర్దముడు స్వాయంభువ మనువును తన ఇంటికి వచ్చిన అతిథిగా భావించి అర్ఘ్యపాద్యాలతో తృప్తి పరచి, భగవంతుని ఆదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు.