పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-771-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఒప్పు నప్పరమ తాపసోత్తముని యాశ్రమంబుఁ గనుంగొని మిత పరిజనంబులతోడం జొచ్చి; యందు.

టీకా:

ఒప్పు = చక్కగా ఉన్న; ఆ = ఆ; పరమ = అత్యుత్తమ; తాపస = తాపసులలో; ఉత్తముని = ఉత్తముని; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; కనుంగొని = చూసి; మిత = కొద్ధిమంది; పరిజనంబులు = సేవకులు; తోడన్ = తోటి; చొచ్చి = ప్రవేశించి; అందు = దానిలో.

భావము:

అటువంటి కర్దమ మునీంద్రుని తపోవనాన్ని దర్శించి స్వాయంభువ మనువు పరిమిత పరివారంతో ఆశ్రమంలోనికి ప్రవేశించి, అక్కడ…