పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-770-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి పుండరీక వృక కా
శశ భల్లూక హరిణ మరీ హరి సూ
ఖడ్గ గవయ వలిముఖ
భప్రముఖోగ్ర వన్యత్త్వాశ్రయ మై.

టీకా:

కరి = ఏనుగులు; పుండరీక = పెద్దపులులు; వృక = తోడేళ్ళు; కాసర = అడవిదున్నలు; శశ = కుందేళ్ళు; భల్లూక = ఎలుగుబంట్లు; హరిణ = లేళ్ళు; చమరీ = చమరీమృగములు; హరి = సింహములు; సూకర = అడవిపందులు; ఖడ్గ = ఖడ్గ మృగములు; గవయ = దుప్పులు; వలిముఖి = కోతులు; శరభ = శరభమృగములు; ప్రముఖ = మొదలగు; వన్య = అడవి; సత్త్వ = జంతువులకు; ఆశ్రమము = నివాసము; ఐ = అయ్యి.

భావము:

ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్ళు, అడవిదున్నలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, లేళ్ళు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, దుప్పులు, కోతులు, శరభాలు మొదలైన అడవి మృగాలు సంచరిస్తున్నాయి.