పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-767-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితసహకారపల్లవ
లితాస్వాదన కషాయకంఠ విరాజ
త్కకంఠ పంచమస్వర
నాదము లుల్లసిల్లఁ డురమ్యములై.

టీకా:

లలిత = సుకుమారమైన; సహకార = మామిడి చెట్ల; పల్లవన్ = చిగుళ్ళను; కలిత = మనోహరమైన; ఆస్వాదన = అసక్తితో తినుటవలన; కషాయ = పదునెక్కిన; కంఠ = గొంతులతో; విరాజత్ = విరాజిల్లుతున్న; కలకంఠ = కోయిలల {కలకంఠ - కల (చక్కని), కంఠ, (కంఠములు గలది), కోయిల}; పంచమస్వర = పంచమస్వరములో; కల = మనోహరమైన; నాదములన్ = నాదములతో; ఉల్లసిల్ల = సంతోషించగ; కడు = మిక్కిలి; రమ్యములు = సొగసైనవి; ఐ = అయ్యి.

భావము:

లేత తియ్య మామిడి చిగుళ్ళను తినడం వల్ల వగరెక్కి పొగరెక్కిన కోయిలలు పంచమస్వరంతో మధురంగా కూస్తున్నాయి.