పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-760-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుల సరస్వతీసరిదుదంచిత బాలరసాలసాల శో
భి తట తుంగరంగ మగు బిందుసరంబు వినిర్గమించి యం
చి గరుడాధిరోహణముసేసి తదీయ గరుత్ప్రభూత రు
క్ప్రతివిలక్షణక్రమవిరాజితసామము వించు మోదియై.

టీకా:

అతుల = సాటిలేని; సరస్వతీ = సరస్వతీ; సరిత్ = నదియందు; ఉదంచిత = ఒప్పుచున్న; బాలరసాల = లేతమామిడి; సాల = చెట్లతో; శోభిత = సొగసైన; తట = తీరమున; తుంగ = ఎత్తైన; రంగము = స్థలము; అగు = అయిన; బిందుసరంబున్ = బిందుసరస్సును; వినిర్గమించి = వెలువడి; అంచిత = చక్కటి; గరుడ = గరుత్మంతుని; అధిరోహణంబున్ = ఎక్కుట; చేసి = చేసి; తదీయ = వాని; గరుత్ = రెక్కలనుండి; ప్రభూత = వెలువడుతున్న; రుక్ = కాంతి; ప్రతతి = మిక్కిలిగ వ్యాపించి; విలక్షణ = ప్రత్యేక; క్రమ = విధమై; విరాజిత = విరాజిల్లుతున్న; సామమున్ = సామవేద ధ్వనిని{గరుత్మంతుని రెక్కలు నుండి సామవేదం ధ్వనిస్తుంది}; వించున్ = వింటూ; మోది = సంతోషి; ఐ = అయ్యి.

భావము:

సాటిలేని సరస్వతీ నదీజలాలతో పెంపొందిన గున్నమామిడి గుబురులతో కనువిందు చేస్తున్న బిందు సరోవరాన్ని దాటి, గరుత్మంతునిపై ఎక్కి, అతని రెక్కల కదలికల చప్పుళ్ళలో సలక్షణమైన సామగానాన్ని వింటూ ఆనందిస్తూ…