పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-758-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునివర! యే కోరిక నీ
మునఁ గామించి నను సమంచిత భక్తిన్
నెరునఁ బూజించితి నీ
యము నా కోర్కి సఫల య్యెడుఁ జుమ్మీ."

టీకా:

ముని = మునులలో; వర = శ్రేష్ఠుడా; ఏ = ఏ; కోరికన్ = కోరికను; నీ = నీ; మనమునన్ = మనసులో; కామించి = కోరి; ననున్ = నన్ను; సమంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; నెనరునన్ = ప్రేమతో; పూజించితి = పూజించితివో; నీకున్ = నీకు; అనయమున్ = అవశ్యము; ఆ = ఆ; కోర్కి = కోరిక; సఫలమున్ = సాఫల్యము; అయ్యెడున్ = అగును; చుమ్మీ = సుమీ.

భావము:

మునీంద్రా! నీవు ఏమి కావాలని కోరి నన్ను భక్తితో ఆరాధించావో ఆ కోరిక నీకు తప్పక నెరవేరుతుంది సుమా!”