పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-757-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిబ్భంగి నుతించినన్ విని సరోజాక్షుండు మోదంబునన్
వితానందన కంధరోపరిచరద్విభ్రాజమానాంగుఁడున్
నురాగస్మితచంద్రికాకలితశోభాలోకుఁడై యమ్మునీం
ద్రునిఁగారుణ్యమెలర్పఁజూచి పలికెన్ రోచిష్ణుఁడై వ్రేల్మిడిన్

టీకా:

అని = అని; ఇబ్భంగిన్ = విధముగ; నుతించినన్ = స్తోత్రము చేయగా; విని = విని; సరోజాక్షుడు = హరి {సరోజాక్షుడు - సరోజము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; మోదంబునన్ = సంతోషముతో; వినత = వినతాదేవి యొక్క; నందన = పుత్రుని; కంధర = మెడపైన; ఉపరి = పైన; చరత్ = తిరుగుతున్న; విభ్రాజమాన = ప్రకాశిస్తున్న; అంగుడు = దేహముకలవాడు; ఐ = అయ్యి; అనురాగ = ప్రేమతో కూడిన; స్మిత = చిరునవ్వు అను; చంద్రికా = వెన్నెల; కలిత = కలిగిన; శోభా = సొగసైన; అలోకుడు = చూపుకలవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; కారుణ్యము = దయ; ఎలర్పన్ = వికసించగా; చూచి = చూసి; పలికెన్ = పలికెను; రోచిష్ణుడు = ప్రకాశించువాడు; ఐ = అయ్యి; వ్రేల్మిడిన్ = చిటికెలో.

భావము:

అని ఈవిధంగా కర్దముడు స్తోత్రం చేయగా విష్ణువు విని గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా కూర్చొని అనురాగంతో కూడిన చిరునవ్వు వెన్నెలలు వెల్లివిరిసే చల్లని చూపులతో ఆ మునీంద్రుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు.