పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-755-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఘా! యొక్కఁడ వయ్యు నాత్మకృత మాయాజాత సత్త్వాది శ
క్తినికాయస్థితి నీ జగజ్జనన వృద్ధిక్షోభ హేతుప్రభా
ని రూఢిం దగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! నీ
లీలా మహిమార్ణవంబుఁ గడవంగా వచ్చునే? యేరికిన్.

టీకా:

అనఘా = భగవంతుడా {అనఘుడు - పాపరహితుడు, విష్ణువు}; ఒక్కడవు = ఒక్కడవే; అయ్యున్ = అయినప్పటికిని; ఆత్మ = తనచేత; కృత = చేయబడిన; మాయా = మాయ వలన; జాత = పుట్టిన; సత్త్వ = సత్తువ; ఆది = మొదలగు; శక్తి = శక్తుల; నికాయ = సమూహముల; స్థితిన్ = స్థితిలో; ఈ = ఈ; జగత్ = విశ్వము యొక్క; జనన = సృష్టి; వృద్ధి = స్థితి; క్షోభ = లయముల; హేతు = కారణము; ప్రభావ = ప్రభావములు; నిరూఢిన్ = అవశ్యము; తగున్ = తగి ఉండును; ఊర్ణనాభి = సాలిగూడు; గతిన్ = వలె; విశ్వస్తుత్య = భగవంతుడా {విశ్వస్తుత్యుడు - విశ్వ (లోకముల) చేత స్తుత్యుడు (స్తుతింపబడువాడ), విష్ణువు}; సర్వేశ = భగవంతుడా {సర్వేశుడు - సర్వులకును ఈశుడు (ప్రభువు), విష్ణువు}; నీ = నీ; ఘన = గొప్ప; లీలా = లీలల యొక్క; మహిమా = మహిమ అను; ఆర్ణవంబున్ = సముద్రమును; కడవంగాన్ = దాటుటకు; వచ్చునే = సాధ్యమా ఏమి; ఏరికిన్ = ఎవరికైనా సరే.

భావము:

పుణ్యాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! నీవు ఒక్కడివే అయినా నీ మాయవల్ల పుట్టిన సత్త్వం మొదలైన శక్తులు సాలీడు సాలెగూడును సృష్టించి మళ్ళీ తనలో లీనం చేసుకున్నట్టు ఈ లోకాలు పుట్టడానికి, వృద్ధిపొందడానికి, నాశం కావడానికి కారణభూత మౌతున్నాయి. అటువంటి నీ అపార లీలావిలాసమైన మహాసముద్రాన్ని దాటడం ఎవరికైనా సాధ్యం అవుతుందా?