పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-753-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"బ్జాక్ష! సకల భూతాంతరాత్ముఁడ వనఁ-
నరుచుండెడి నీదు ర్శనంబుఁ
లకొని సుకృతసత్ఫలభరితంబు లై-
ట్టి యనేక జన్మానుసరణ
ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లై-
ట్టి యోగీశ్వరు లాత్మఁ గోరి
యెంతురు యోగీశ్వరేశ్వర యే భవ-
త్పాదారవింద సంర్శనంబు

3-753.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గంటి భవవార్థిఁ గడవంగఁ గంటి మంటిఁ
డఁగి నా లోచనంబుల లిమి నేఁడు
విలి సఫలత నొందె; మావ! ముకుంద!
చిరదయాకర! నిత్యలక్ష్మీవిహార!

టీకా:

అబ్జాక్ష = నారాయణ {అబ్జాక్షుడు - అబ్జము (పద్మము) ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; సకలభూతాతంరాత్ముడవు = నారాయణుడవు {సకలభూతాతంరాత్ముడు - సమస్తమైన భూతము (ప్రాణు) లందును ఆత్మరూపమున ఉండువాడు, విష్ణువు}; అనన్ = అనగా; తనరుచున్ = అతిశయించి; ఉండెడి = ఉండునట్టి; నీదు = నీ యొక్క; దర్శనంబున్ = దర్శనము; తలకొని = శిరసావహించి; సుకృత = పుణ్యకార్యముల; సత్ = మంచి; ఫల = ఫలితములతో; భరితంబులున్ = నిండినవి; ఐనట్టి = అయినట్టి; అనేక = ఎన్నో; జన్మ = జన్మలనుండి; అనుసరణ = అనసరించుచున్న; ప్రకట = ప్రసిద్ధమైన; యోగక్రియా = యోగక్రియలను; అభ్యాస = అభ్యసించుటలో; నిరూఢులు = మిక్కిలి నేర్పరులు; ఐనట్టి = అయినట్టి; యోగ = యోగులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; ఆత్మన్ = మనసులో; కోరి = కోరి; ఎంతురు = కీర్తింతురు; యోగీశ్వరేశ్వర = నారాయణా {యోగీశ్వరేశ్వరుడు - యోగీశ్వరులకు ఈశ్వరుడు, విష్ణువు}; ఏన్ = నేను; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; సందర్శనమున్ = చక్కటి దర్శనమును; కంటిన్ = చూసితిని;
భవ = సంసారము అను; వార్థిన్ = సముద్రమును; గడవంగన్ = దాటగ; కంటిన్ = చూసితిని; మంటిన్ = బ్రతికితిని; కడగి = చివరకు; నా = నా యొక్క; లోచనంబుల = కన్నులు అను; కలిమి = సంపద; నేడు = ఈనాడు; తవిలి = పూని; సఫలతన్ = సాఫల్యమును; ఒందెన్ = పొందెను; మాధవ = గోవిందా {మాధవుడు - మానసములకు ధవుడు (ప్రభువు), విష్ణువు}; ముకుంద = గోవిందా {ముకుందుడు - విష్ణువు}; చిరదయాకర = గోవిందా {చిరదయాకర - చిర మిక్కిలి దయ (కృప)ను కర (ఇచ్చువాడ), విష్ణువు}; నిత్యలక్ష్మీవిహార = గోవిందా {నిత్యలక్ష్మీవిహార - నిత్య (శాశ్వతమైన) లక్ష్మీదేవి (సంపదలు) తో విహార (వర్తించువాడ), విష్ణువు}.

భావము:

ఓ పుండరీకాక్షా! అఖిల ప్రాణులకు అంతరాత్మవై ఉండే నీ దర్శనం కోరి పురాకృత పుణ్యంతో నిండి అనేక జన్మలుగా నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు కీర్తిస్తుంటారు. అట్టి యోగీశ్వరులకు ఈశ్వరుడవైన నీ పాదపద్మాలను దర్శించాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయారూపా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం ఇప్పుడు లభించింది.