పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-752-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముకుళిత కరకమలుండయి
కుటిల సద్భక్తి పరవశాత్మకుఁ డగుచున్
విచాంభోరుహలోచను
కు నిట్లనియెం దదానముఁ గనుఁ గొనుచున్.

టీకా:

ముకుళిత = మోడ్చిన; కర = చేతులు అను; కమలుండు = కమలములు కలవాడు; అయి = అయ్యి; అకుటిల = స్వచ్ఛమైన; సత్ = మంచి; భక్తి = భక్తితో; పరవశ = పరవశమైన; ఆత్మకుడు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; వికచాంభోరుహలోచనున్ = విష్ణుమూర్తి {విక చాంభోరుహ లోచనుడు - వికచ (వికసించిన) అంభోరుహము (పద్మము) లవంటి లోచనుడు (కన్నులుకలవాడు), విష్ణువు}; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; తత్ = అతని; ఆననమున్ = మోమును; కనుగొనుచున్ = చూస్తూ;

భావము:

చేతులు జోడించి నిర్మలమైన భక్తిభావంతో మైమరచి వికసించిన పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుముఖాన్ని చూస్తూ ఇలా అన్నాడు.