పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-751-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; శబ్దబ్రహ్మశరీరవంతుండును, సదాత్మకుండును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందుని గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును లబ్ధ మనోరథుండును నగుచు సాష్టాంగదండప్రణామంబు లాచరించి; తదనంతరంబ.

టీకా:

మఱియున్ = ఇంకనూ; శబ్ద = శబ్దరూప; బ్రహ్మ = బ్రహ్మ; శరీర = స్వరూపము; వంతుడును = కలవాడును; సత్ = సత్తు (సత్యమే); ఆత్మకుండును = తానైనవాడును; జ్ఞాన = జ్ఞానము ద్వారా; ఏక = మాత్రమే; వేద్యుండును = తెలియబడువాడును; వైనతేయ = గరుత్మంతుని {వైనతేయుడు - వినుతాదేవి యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; అంస = మూపున; విన్యస్త = ఉంచబడిన; చరణ = పాదములు అనెడి; అరవిందుండునున్ = పద్మములు కలవాడును; అయిన = అయినట్టి; గోవిందుని = విష్ణుమూర్తిని {గోవిందుడు - గో (జీవముల)కు ప్రభువు, విష్ణువు}; కనుంగొని = దర్శించి; సంజాత = కలిగిన; హర్ష = ఆనందపు; లహరీ = అలలచేత; పరవశుండును = పరవశించినవాడును; లబ్ధ = లభించిన; మనోరథుండు = కోరికలు కలవాడును {మనోరథము - మనసున రథ (తిరుగునది), కోరిక}; అగుచున్ = అవుతూ; సాష్టాంగదండప్రణామంబుల్ = సాష్టాంగనమస్కారములు {సాష్టాంగదండప్రణామము - కలిగిన అష్ట (ఎనిమిది, 8) అంగ (అవయవములు) దండ (కఱ్ఱవలె) నేలపై పెట్టి చేయు ప్రణామము (నమస్కారము)}; ఆచరించి = చేసి; తదనంతరంబ = తరువాత.

భావము:

ఇంకా శబ్దబ్రహ్మమే శరీరంగానూ, అస్తిత్వమే ఆత్మగానూ కలిగి జ్ఞానం చేత మాత్రమే తెలుసుకోదగినవాడై గరుత్మంతుని మూపుమీద పాదపద్మాలు మోపి ఉన్న ఆ గోవిందును చూచి కర్దముడు ఆనంద తరంగాలతో పరవశుడై కోరిక తీరినవాడై సాష్టాంగ ప్రణామాలు చేసి…