పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-750-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణి సుధాకర కిణ సమంచిత-
రసీరుహోత్పల స్రగ్విలాసు
కంకణ నూపురగ్రైవేయ ముద్రికా-
హారకుండల కిరీటాభిరాము
మనీయ సాగరన్యకా కౌస్తుభ-
ణి భూషణోద్భాసమాన వక్షు
లలిత దరహాస చంద్రికా ధవళిత-
చారు దర్పణ విరాత్కపోలు

3-750.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శంఖ చక్ర గదాపద్మ చారు హస్తు
లికులాలక రుచిభాస్వలికఫలకు
పీకౌశేయవాసుఁ గృపారంగి
స్మితేక్షణుఁ బంకజోరుని హరిని.

టీకా:

తరణి = సూర్యుని; సుధాకర = చంద్రుని; కిరణ = కిరణములతో; సమంచిత = ఒప్పారుతున్న; సరసిరుహ = పద్మముల; ఉత్ఫల = కలవపువ్వుల; స్రక్ = దండలతో; విలాసున్ = సొగసైనవానిని; కంకణ = కంకణములు; నూపుర = కాలి అందెలు; గ్రైవేయ = ఆభరణములు; ముద్రికా = ఉంగరములు; హార = ముత్యాల హారములు; కుండల = చెవి కుండలములు; కిరీట = కిరీటము లతో; అభిరామున్ = ఒప్పుతున్నవానిని; కమనీయ = మనోహరమైన; సాగరకన్యకా = లక్ష్మీదేవిచేతను {సాగరకన్యక -సాగరము (సముద్రము) యొక్క కన్యక (పుత్రిక), లక్ష్మీదేవి}; కౌస్తుభ = కౌస్తుభము అనెడి; మణి = మణిచేతను; భూషణ = అలంకరింపబడిన; ఉదత్ = మిక్కిలి; భాసమాన = ప్రకాశవంతమైన; వక్షు = వక్షస్థలముకలవానిని; సలలిత = మనోహరమైన; దరహాస = చిరునవ్వుల; చంద్రికా = వెన్నెలలతో; ధవళిత = తెల్లగా అయిన; చారు = అందమైన; దర్పణ = అద్దాలవలె; విరాజత్ = విరాజిల్లుతున్న; కపోలు = చెక్కిళ్ళుకలవానిని;
శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; పద్మ = పద్మములతో; చారు = అందమైన; హస్తు = చేతులుకలవానిని; అలి = తుమ్మెదల; కుల = గుంపు వంటి; అలక = ముంగురుల; రుచి = కాంతితో; భాస్వత్ = మెరయుచున్న; అలిక = నుదటి; ఫలకున్ = భాగముకలవానిని; పీత = పచ్చని; కౌశేయ = పట్టుబట్ట; వాసున్ = ధరించినవానిని; కృపా = దయతో; తరంగిత = తొణికిసలాడుతున్న; స్మిత = చిరునవ్వు; ఈక్షణున్ = చూపులుకలవానిని; హరిని = విష్ణుమూర్తిని.

భావము:

సూర్య చంద్ర కిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, కలువపూలతోను కట్టిన అందమైన పూలమాలను ధరించినవాడూ, కంకణాలను, నూపురాలను, కంఠాభరణాలను, ఉంగరాలను, రత్నహారాలను, మకర కుండలాలను, కిరీటాన్ని ధరించి ప్రకాశించేవాడూ, అందమైన లక్ష్మీదేవితో కౌస్తుభమణితో అలంకరింపబడి మెరిసే వక్షస్థలం కలవాడూ, సొగసైన చిరునవ్వు వెన్నెలతో ప్రకాశించే చెక్కుటద్దాలతో విరాజిల్లుతున్నవాడూ, శంఖం, చక్రం, గద, పద్మం చేతుల్లో ధరించినవాడూ, తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అందంగా ప్రకాశించే ఫాలభాగం కలవాడూ, పచ్చని పట్టువస్త్రం ధరించినవాడూ, మందహాసంతో దయ పొంగిపొరలే చూపులు కలవాడూ, పద్మనాభుడూ అయిన హరిని…