పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-748-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుఁ బ్రసన్ను మనోరథ
దానసుశీలు నమరవంద్యు రమేశున్
దురితవిదూరు సుదర్శన
రుఁ బూజించిన నతండు రుణాకరుఁడై.

టీకా:

వరదున్ = నారాయణుని {వరదుడు - వరములు ఇచ్చువాడు, విష్ణువు}; ప్రసన్నున్ = నారాయణుని {ప్రసన్నుడు - అనుకూలమైనవాడు, విష్ణువు}; మనోరథవరదానసుశీలున్ = నారాయణుని {మనోరథ వర దాన సుశీలుడు - మనరథ (మనసులోకలిగిన)(కోరిన) వరములను దాన (ఇచ్చు) సుశీలుడు (మంచిగుణము) కలవాడు, విష్ణువు}; అమరవంద్యున్ = నారాయణుని {అమర వంద్యుడు - అమర (దేవతల)చే వంద్యుడు (పూజింపబడు)వాడు, విష్ణువు}; రమేశున్ = నారాయణుని {రమేశు - రమ (లక్ష్మీదేవి)కి ఈశుడు (భర్త), విష్ణువు}; దురితవిదూరున్ = నారాయణుని {దురిత విదూరుడు - దురితములు (పాపములు)ను విదూరుడు(పొగొట్టువాడు), విష్ణువు}; సుదర్శనకరున్ = నారాయణుని {సుదర్శన కరుడు - సుదర్శన చక్రము చేతకలవాడు, విష్ణువు}; పూజించినన్ = సేవించగా; అతండున్ = అతడును; కరుణాకరుడు = నారాయణుడు {కరుణా కరుడు - కరుణ (దయ)కు కరుడు (నిలయము) ఐనవాడు, విష్ణువు}; ఐ = అయ్యి.

భావము:

వరాల నిచ్చేవాడూ, దయతో కోరిన కోరికలను తీర్చే స్వభావం కలవాడూ, దేవతల చేత నమస్కరింపబడేవాడూ, లక్ష్మీపతీ, పాపాలను తొలగించేవాడూ, సుదర్శన చక్రాన్ని ధరించేవాడూ అయిన విష్ణువును ఆరాధించగా ఆ దేవుడు కరుణించి…