పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-747-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధీరగుణుఁడు సరస్వతీతీర మందుఁ
విలి పదివేల దివ్యవత్సరము లోలిఁ
పముసేయుచు నొకనాఁడు పసమాధి
నుండి యేకాగ్రచిత్తుఁడై నిండు వేడ్క.

టీకా:

ధీర = ధైర్యము కల; గుణుడు = గుణములు కలవాడ; సరస్వతీ = సరస్వతి అను నదీ; తీరము = తీరము; అందున్ = అందు; తవిలి = పూనుకొని; పదివేల = పదివేల (10000); దివ్యవత్సరములు = దివ్యసంవత్సరములు; ఓలిన్ = వరుసగా; తపమున్ = తపస్సు; చేయుచున్ = చేస్తూ; ఒక = ఒక; నాడు = దినమున; జప = జపమునను; సమాధిన్ = సమాధి స్థితి యందును; ఉండి = ఉండి; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; నిండు = పూర్తి; వేడ్కన్ = సంతోషముతో.

భావము:

ధీరుడైన ఆ ముని సరస్వతీ నదీతీరంలో పదివేల దేవతా సంవత్సరాలు విడువకుండా తపస్సు చేస్తూ ఒకనాడు ధ్యానతత్పరుడై, ఏకాగ్రచిత్తంతో అత్యంత సంతోషంతో…