పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దమునికి హరి ప్రత్యక్షం బగుట

  •  
  •  
  •  

3-746-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విను; మనఘ! కృతయుగంబున
మునినాథుం డయిన కర్దముఁడు ప్రజల సృజిం
ను వనజసంభవునిచే
నియుక్తుం డగుచు మది ముము సంధిల్లన్.

టీకా:

వినుము = వినుము; అనఘ = పుణ్యుడా; కృతయుగంబునన్ = కృతయుగమున; ముని = మునులలో; నాథుడు = ప్రభువు; అయిన = అయిన; కర్దముడు = కర్దముడు; ప్రజలన్ = సంతానమును; సృజింపను = సృష్టించు కొరకు; వనజసంభవుని = బ్రహ్మదేవుని {వనజసంభవుడు - వనజము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; చేతన్ = చేత; నియుక్తుండు = నియమింపబడిన వాడు; అగుచున్ = అవుతూ; మదిన్ = మనసున; ముదము = సంతోషములు; సంధిల్లన్ = కలుగునట్లుగా.

భావము:

ఓ పుణ్యాత్ముడవైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుని చేత ప్రజలను సృష్టించడానికి కర్దమ మునీశ్వరుడు నియమింపబడ్డాడు. అందుకు కర్దముడు సంతోషించి…