పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-744.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మమార్గంబు లేదియుఁ ప్పకుండ
నఘులై యెట్లు పాలించి య్య! వారి
రిత మెల్లను సత్కృపా నితబుద్ధి
నెఱుఁగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర!

టీకా:

వర = శ్రేష్ఠమైన; గుణ = గుణములు కలవాడ; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మను = మనువు యొక్క; వంశంబున్ = వంశము; ఇలన్ = భూమిమీద; పరమ = మిక్కిలి; సమ్మతము = ఒప్పియున్నది; తప్పదు = తప్పదు; తలపన్ = తలచుకొన; గొనకొని = పూని; తత్ = అతని; వంశమునన్ = వంశమున; మిధునక్రియన్ = సంభోగము {మిధునక్రియ - భార్యాభర్తల విధానము, సంభోగము}; చేసి = వలన; ప్రజా = సంతానము; వృద్ధిన్ = వృద్ధిపొందుటను; చెప్పితివి = చెప్పితివి; ఈవు = నీవు; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువున్ = మనువున; కున్ = కు; పూని = పూని; ప్రియవ్రత = ప్రియవ్రతుడును; ఉత్తానపాదులు = ఉత్తానపాదుడును; అను = అనెడి; నందనులు = పుత్రులు; కలరు = ఉన్నారు; అంటివి = అన్నావు; వారు = వారు; సప్త = ఏడు (7); ద్వీపవతి = ద్వీపములు కలది; ఐన = అయినట్టి; ధాత్రిన్ = భూమిని; ఎల్లన్ = అంతను;
ధర్మ = ధర్మబద్ధమైన; మార్గంబులున్ = విధానములు; ఏదియున్ = ఏ ఒక్కటియును; తప్పకుండన్ = తప్పకుండగ; అనఘులు = పాపములు లేనివారు; ఐ = అయ్యి; ఎట్లు = ఏవిధముగ; పాలించిరి = పరిపాలించిరి; అయ్య = తండ్రి; వారి = వారి యొక్క; చరితమున్ = వర్తనములు; ఎల్లను = సమస్తమును; సత్ = మంచి; కృపా = దయతోకూడిన; నిరత = మిక్కిలి ఆసక్తికొన్న; బుద్ధిన్ = బుద్ధితో; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపింపు = వినిపించుము; నాకున్ = నాకు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠమైనవారిలో; చంద్ర = చక్కనివాడ.

భావము:

ఉత్తమ గుణాలు కల మైత్రేయా! భూమిమీద స్వాయంభువ మనువు వంశం ధర్మసమ్మతమనీ, ఆ వంశంలో స్త్రీపురుష యోగం వల్ల ప్రజావృద్ధి జరిగిందనీ నీవు చెప్పావు. అంతేకాక ఆ స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారనీ అన్నావు. వారు ఏడు దీవులతో కూడిన భూమండలమంతా ధర్మమార్గం ఎంతమాత్రం తప్పకుండా పుణ్యాత్ములై ఎట్లా పాలించారు? ఓ మునివరా! వారి చరిత్ర అంతా నాకు దయార్ద్రబుద్ధితో వివరించు.