పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-741-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జజుఁడు దన్నుఁ గృతకృ
త్యునిఁగా భావించి యాత్మఁ దుష్టివహింపన్
మున నిఖిల జగత్పా
ను లగు మనులం ద్రిలోకరుల సృజించెన్.

టీకా:

వనజజుడు = బ్రహ్మదేవుడు {వనజజుడు - వనజము (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; తన్నున్ = తనను; కృతకృత్యుని = అనుకొన్నపని పూర్తిచేసినవాని; కాన్ = అయినట్లు; భావించి = అనుకొని; ఆత్మన్ = ఆత్మలో; తుష్టి = సంతృప్తి; వహింపన్ = వహించగ; మనమునన్ = మనసులో; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకములకును; పావనులు = పవిత్రము చేయువారు; అగు = అయిన; మనులన్ = మనువులను; త్రి = మూడు; లోక = లోకములకును; వరులన్ = శ్రేష్ఠులను; సృజించెన్ = సృష్టించెను.

భావము:

బ్రహ్మదేవుడు తాను పూనిన పని నెరవేరినట్లుగా భావించి తన అంతరాత్మ తృప్తిపడే విధంగా సమస్త జగత్తులో పవిత్రులూ, ముల్లోకాలలో శ్రేష్ఠులూ ఐన మనువులను సృష్టించాడు.