పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-734.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి మైపూఁత సాంధ్యరాగంబు గాఁగఁ
నంగనాకృతి నొప్పు సంధ్యావధూటిఁ
దిసి మనముల మోహంబు డలుకొనఁగ
సురు లందఱు గూడి యిట్లనిరి మఱియు.

టీకా:

గురు = పెద్ద; కుచ = స్తనముల; భార = భారమువలన; సంకుచితా = చిక్కిపోయిన; అవలగ్నము = నడుము; తనరారు = అతిశయించు; ఆకాశతలము = ఆకాశము అను ప్రదేశము; కాగ = అవుతుండగ; లలిత = సున్నితమైన; పల్లవ = లేతకొమ్మ వంటి; పాణితలమునన్ = అరచేతియందు; చెన్నొందు = ప్రకాశించు; చెండు = పూబంతి; పతత్ = అస్తమిస్తున్న; పతంగుడు = సూర్యుడు; కాగ = అవుతుండగ; సలలిత = సుకుమారమైన; నీల = నల్లని; పేశల = మెత్తని; పృథు = పెద్ద; ధమిల్ల = జుట్టు; బంధంబున్ = ముడి; ఘన = చిమ్మ; తమః = చీకటుల; పటలి = సమూహము; కాగ = అవుతుండగ; ప్రవిమలతర = అతినిర్మలమైన {ప్రవిమలము - ప్రవిమలతరము - ప్రవిమలతమము}; కాంత = మనోహర; భావ = భావములతో కూడిన; విలోకన = చక్కటి చూపు; జాలంబుల్ = సమూహములు; ఉదార = కాంతివంతమైన; తారకా = తారకల; సమితి = గుంపు; కాగ = అవుతుండగ; కడగి = పూని;
మై = మేని, వంటి; పూత = విలాసము; సాంధ్య = సంధ్యకాలము యొక్క; రాగంబున్ = ఎరుపు; కాగ = అవుతుండగ; అంగన = స్త్రీ {అంగన - చక్కటి అంగములు కలది, స్త్రీ}; ఆకృతిన్ = రూపమున; ఒప్పు = చక్కగా ఉన్న; సంధ్యా = సంధ్య అను; వధూటిన్ = స్త్రీని; కదిసి = సమీపించి; మనములన్ = మనసులలో; మోహంబున్ = మోహములు; కడలుకొనగ = కమ్ముకోగ; అసురులు = రాక్షసులు; అందఱున్ = అందరు; కూడి = కలసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; మఱియున్ = ఇంకను.

భావము:

కుచకుంభాల బరువువల్ల జవజవలాడే నడుము ఆకాశం కాగా, అందమైన చిగురాకువంటి హస్తంలో ప్రకాశించే పూలచెండు అస్తమించే సూర్యబింబం కాగా, నల్లగా మెరుస్తూ విప్పారిన కొప్పుముడి చీకటి రేకలు కాగా, స్వచ్ఛమైన భావాలను వెల్లడిస్తూ మెరిసే చూపులు నక్షత్రాలు కాగా, శరీరానికి పూసుకున్న గంధపు పూత సంధ్యారాగం కాగా, స్త్రీరూపాన్ని ధరించిన ఆ సంధ్యాదేవిని అసురులు చుట్టుముట్టి, హృదయాలలో పెచ్చరిల్లిన మోహావేశంతో ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు.