పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-728-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఈ సౌకుమార్య మీ వయ
సీ సౌందర్యక్రమంబు నీ ధైర్యంబు
న్నీ సౌభాగ్యవిశేషము
నే తులకుఁ గలదు చూడనిది చిత్ర మగున్.”

టీకా:

ఈ = ఈ; సౌకుమార్యమున్ = సుకుమారత్వమును; ఈ = ఈ; వయస్ = యౌవనము; ఈ = ఈ; సౌందర్యక్రమమున్ = సుందరత; ఈ = ఈ; ధైర్యంబున్ = ధైర్యమును; ఈ = ఈ; సౌభాగ్య = సౌభాగ్యము యొక్క; విశేషమున్ = ప్రత్యేకతయును; ఏ = ఏ; సతుల్ = స్త్రీల; కున్ = కి; కలదు = ఉన్నది; చూడన్ = చూస్తే; ఇది = ఇది; చిత్రము = విచిత్రము; అగున్ = అయు ఉన్నది.

భావము:

“ఈ సౌకుమార్యం, ఈ నవయౌవనం, ఈ సౌందర్యం, ఈ జాణతనం, ఈ సౌభాగ్యవిశేషం ఏ స్త్రీలకూ లేదు. ఇది చాల చిత్రంగా ఉంది”.