పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-726.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పరపక్షాష్టమీ శశాంకాభ నిటల
దవదలికులరుచిరోపమాన చికుర
లితచంపకకుసుమవిలాస నాస
హాసలీలావలోకన బ్జపాణి.

టీకా:

నవ్య = కొత్త; కాంచన = బంగారపు; రణత్ = గజ్జలు {రణత్ -శబ్దముచేయుచున్న, గజ్జలు}; మణి = మణులు పొదిగిన; నూపుర = అందెల; ఆరావ = ధ్వనులచే; విలసిత = విలసిల్లుచున్న; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మముల; యుగళ = జంట కలదియును; కాంచీ = మొలనూలు యొక్క; కలాప = చక్కదనముతో; సంకలిత = కూడిన; దుకూల = జిలుగు; వస్త్ర = వస్త్రములచే; స్పార = స్పురిస్తున్న; పులిన = ఇసుకతిన్నెల వంటి; నితంబ = పిరుదుల; బింబ = భాగముకలదియును; రాజిత = విరాజిల్లుతున్; అన్యోన్య = ఒకదానికొకటి; కర్కశ = కఠినముగ; పీన = బలమైన; కరి = ఏనుగు; కుంభ = కుంభస్థలముల వలె; పృథు = పెద్దవైన; కుచ = స్తనముల యొక్క; భార = బరువు వలన; కంపిత = చలిస్తున్న; వలగ్న = నడుము కలదియును; మదిరా = మద్యమును; రసాస్వాద = తీసుకొనుటచే; మద = మత్తువలన; విఘూర్ణిత = మిక్కిలి తిరుగుతున్న; చారు = అందముగా; సిత = ప్రకాశిస్తున్న; నవ = లేతగా; వికచ = వికసించిన; రాజీవ = ఎఱ్ఱకలువల వంటి; నయన = కన్నులు కలదియును;
అపర = కృష్ణ; పక్ష = పక్షమునందలి; అష్టమీ = అష్టమినాటి; శశాంక = చంద్రుని; అభ = వంటి; నిటల = నుదురు కలదియును; మదవత్ = మత్తెక్కిన; అలి = తుమ్మెదల; కుల = గుంపు; రుచిర = అందముతో; ఉపమాన = పోల్చ తగ్గ; చికుర = ముంగురులు కలదియును; లలిత = అందమైన; చంపక = సంపెంగ; కుసుమ = పుష్పము యొక్క; విలాస = విలాసము కల; నాస = ముక్కు కలదియును; హాస = నవ్వుల; లీలా = లీలలతో కలసిన; అవలోకన = చూపులు కలదియును; అబ్జ = పద్మములవంటి; పాణి = అరచేతులు కలదియును.

భావము:

అప్పుడు ఆ దేహం నుండి మణులు పొదిగిన క్రొత్త బంగారు కాలి అందెలు ఘల్లుఘల్లుమని మ్రోగే పాదపద్మాలు కలది, మెత్తని పట్టుచీరపై మిలమిల మెరుస్తున్న మొలనూలుతో ఇసుకతిన్నెలవలె ఉన్న కటిప్రదేశం కలది, ఒకదానితో ఒకటి ఒరసికొంటున్న కుచకుంభాల బరువుకు నకనకలాడే నడుము కలది, మద్యపానం మత్తుతో చలిస్తున్న అప్పుడే వికసించిన పద్మాలవంటి కన్నులు కలది, కృష్ణపక్షపు అష్టమినాటి చంద్రుని పోలిన నుదురు కలది, మదించిన తుమ్మెదలకు సాటి వచ్చే శిరోజాలు కలది, అందమైన సంపంగి పువ్వు వలె సోగదేలిన ముక్కు కలది, చిరునవ్వులు చిందే చూపుల కలది, తామరపూలవంటి చేతులు కలది....