పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-724-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రజాసృష్టి కల్పనం బే నొనర్ప
నందుఁ బాపాత్ము లైన యీ సురు లిపుడు
ను రమింపఁగ డాయవచ్చినఁ గలంగి
యిటకు వచ్చితి ననుఁ గావు మిద్దచరిత!

టీకా:

ఈ = ఈ; ప్రజా = ప్రజలను; సృష్టినిన్ = సృష్టిని; కల్పనంబున్ = ఏర్పరుచుట; ఏన్ = నేను; ఒనర్పన్ = చేయుచుండగ; అందున్ = దానిలోని; పాపాత్ములు = పాపులు; ఐన = అయినట్టి; ఈ = ఈ; అసురులున్ = రాక్షసులు; ఇపుడున్ = ఇప్పుడు; ననున్ = నన్ను; రమింపగన్ = సంభోగించుటకు; డాయన్ = సమీపమునకు; వచ్చినన్ = రాగా; కలంగి = కలత చెంది; ఇట = ఇక్కడ; కున్ = కు; వచ్చితిన్ = వచ్చితిని; ననున్ = నన్ను; కావుము = కాపాడుము; ఇద్ధచరిత = భగవంతుడా {ఇద్ధచరితుడు - ఇద్ధ (ప్రసిద్ధిచెందిన) చరిత (నడవడిక) కలవాడు, విష్ణువు}.

భావము:

ఈ ప్రజలను సృష్టించగా వారిలో పాపాత్ములైన ఈ రాక్షసులు నన్నే రమించాలని రాగా చింత చెంది ఇక్కడికి వచ్చాను. ఓ సుచరిత్రా! నన్ను రక్షించు.