పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-723-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రక్షింపుము రక్షింపు ము
పేక్షింపక వినుత నిఖిల బృందారక! వి
శ్వక్షేమంకర! విను మిటు
క్షత నీ యాజ్ఞ నేను లనిడి వరుసన్.

టీకా:

రక్షింపుము = రక్షింపుము; రక్షింపుము = రక్షింపుము; ఉపేక్షింపక = ఆలస్యము చేయక; వినుతనిఖిలబృందారక = భగవంతుడా {వినుత నిఖిల బృందారకుడు - వినుత (స్తుతించుచున్న) నిఖిల (సమస్తమైన) బృందారకుడు ( దేవగణములు కలవాడు), విష్ణువు}; విశ్వక్షేమంకర = భగవంతుడా {విశ్వ క్షేమంకరుడు - విశ్వమునకు క్షేమము (శుభము)ను కరుడు (చేయువాడు) ,విష్ణువు}; వినుము = వినుము; ఇటు = ఇటుకేసి; దక్షతన్ = సామర్థ్యముతో; నీ = నీ యొక్క; ఆజ్ఞన్ = ఆనతిని; నేను = నేను; తలనిడి = శిరస్సున ధరించి; వరుసన్ = క్రమముగా.

భావము:

“సమస్త దేవతలచేత పొగడబడేవాడా! విశ్వానికి క్షేమాన్ని కలిగించేవాడా! రక్షించు! రక్షించు! ఉపేక్షించక నన్ను రక్షించు. నా మాటను ఆలకించు. నేను నీ ఆజ్ఞను తలదాల్చి క్రమంగా...