పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-721.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందులో యక్ష రక్షస్సు న జనింప
వారి కప్పుడు క్షుత్తృషల్ ఱలఁ గొంద
ఱా చతుర్ముఖు భక్షింతు నిరి కొంద
తని రక్షింతు మని తగవాడి రంత.

టీకా:

తామిస్రమునున్ = చీకటిని {తామిశ్రము - చీకటి - ఏమియును తెలియని జంతుప్రాయము}; అంధతామిస్రము = గుడ్డిచీకటియును {అంధతామిశ్రము - గుడ్డిచీకటి - గుడ్డితనము వలె ఉన్నదని తెలియును కాని చూడలేని పరిస్థితి}; తమమును = తమోగుణమును {తమము - తమోగుణము వలె చూడగలిగినను తగువర్తన తెలియని పరిస్థితి}; మోహమును = మోహము {మోహము - ప్రజ్ఞను మరగుపరచునది - తగువర్తన తెలిసినను భౌతికములందు మిక్కిలి సంగము లేదా మమకారము}; మహామోహనంబును = మహామోహనము {మహామోహనము - అంతర్యామిత్వమును మరగుపరచునది - తగువర్తన తెలిసినను ఆత్మ తత్త్వము తెలియని పరిస్థితి}; అను = అనెడి; పంచ = ఐదు (5); మోహ = మోహముల; రూపాత్మకము = రూపముకలిగినది; ఐన = అయిన; అవిద్య = అవిద్యను; పుట్టించి = సృష్టించి; ఆ = ఆ; వేళన్ = సమయమున; కున్ = కు; అది = అది; తమస్ = తమోగుణము; మయ = నిండిన; దేహము = శరీరము; అని = అని; ధాత = బ్రహ్మదేవుడు; రోసి = అసహ్యించుకొని; తత్ = ఆ; తనువున్ = శరీరమును; విసర్జించెన్ = వదలివేసెను; ధాతృ = బ్రహ్మదేవునిచే; ముక్త = వదలబడిన; దేహంబున్ = శరీరమును; సతత = ఎల్లప్పుడును కలుగు; క్షుత్ = ఆకలి; తృష్ణముల్ = దాహముల; కున్ = కు; ఆవాసమునున్ = నివాసమును; రాత్రి = రాత్రి (చీకటి); మయమున్ = నిండినదియును; అయ్యెన్ = అయినది; తలంప = చూడగా; అందు = దాని; లోన్ = లో;
యక్ష = యక్షులు; రక్షస్సులు = రాక్షసులు; అనన్ = అనెడి వారు; జనింపన్ = పుట్టగ; వారి = వారి; కిన్ = కి; అప్పుడున్ = అప్పుడు; క్షుత్ = ఆకలి; తృషల్ = దప్పులు; వఱలన్ = వర్తింపగ; కొందఱు = కొంతమంది; ఆ = ఆ; చతుర్ముఖున్ = చతుర్ముఖబ్రహ్మను; భక్షింతుము = తినెదము; అనిరి = అన్నారు; కొందఱు = కొంతమంది; అతనిన్ = అతనిని; రక్షింతుము = కాపాడెదము; అని = అని; తగవాడిరి = దెబ్బలాడిరి; అంత = అంతట.

భావము:

బ్రహ్మదేవుడు తామిస్రం, అంధతామిస్రం, తమం, మోహం, మహామోహం అనే ఐదు విధాలైన మోహస్థితి కలిగిన అవిద్యను పుట్టించి, అది తనకు మోహమయమైన శరీరమని భావించి ఏవగించుకొని, ఆ దేహాన్ని వదిలివేశాడు. బ్రహ్మ వదిలిపెట్టిన ఆ దేహం ఆకలి దప్పులకు స్థానమై రాత్రమయ మయింది. దానిలో నుండి యక్షులూ, రక్షస్సులూ అనే ప్రాణులు పుట్టగా వారికి ఆకలి దప్పులు అధికం కాగా కొందరు బ్రహ్మను భక్షిద్దా మన్నారు, మరి కొందరు రక్షిద్దా మన్నారు.