పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-720-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు-
సాహస్ర దివ్యవర్షంబులోలి
సియించి యుండె నా వాసుదేవుని నాభి-
యందు సహస్ర సూర్యప్రదీప్తిఁ
నరుచు సకలజీనికాయ యుత మగు-
పంకజాతంబు సంవము నొందెఁ
రఁగంగ నందులో గవదధిష్ఠితుం-
డై స్వరాట్టగు చతురాననుండు

3-720.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నన మొందెను దత్పద్మసంభవుండు
నామరూపగుణాది సంజ్ఞాసమేతుఁ
గుచు నిర్మాణ మొనరించె ఖిలజగము
నజజుండు నిజచ్ఛాయలన మఱియు.

టీకా:

నారాయణ = నారాయణుడు {నారాయణుడు - నారములు (నీరు) అందు వసించువాడు, భగవంతుడు}; ఆఖ్యన్ = అను పేరుతో; ఉన్నతిన్ = అతిశయించి; ఒప్పు = ఒప్పెడి; బ్రహ్మంబు = బ్రహ్మము {బ్రహ్మము - పెద్దది అగు లక్షణము కలది}; సహస్ర = వెయ్యి (1000); దివ్యవర్షంబులున్ = దివ్యసంవత్సరములు; ఓలిన్ = వరుసగా; వసియించి = నివాసముగ; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; వాసుదేవుని = భగవంతుడు {వాసుదేవుడు - వసించుదేవుడు, హరి}; నాభి = నాభి; అందున్ = అందు; సహస్ర = వెయ్యి (1000); సూర్య = సూర్యుల; ప్రదీప్తిన్ = ప్రకాశముతో; తనరుచున్ = అతిశయించి; సకల = సమస్తమైన; జీవ = ప్రాణుల; నికాయ = సమూహములతో; యుతము = కూడియున్నది; అగుచున్ = అవుతూ; పంకజాతంబున్ = పద్మము {పంకజాతము - పంక (నీటి)లో జాతము (పుట్టినది), పద్మము}; సంభవమున్ = ఏర్పడుట; ఒందెన్ = జరగెను; పరగగన్ = జరుగగా; అందు = దాని; లో = లో; భగవత్ = భగవంతునిచే; అధిష్టితుండు = స్థానము పొందినవాడు; ఐ = అయ్యి; స్వరాట్టు = తనకుతానే అధిపతి; ఐ = అయ్యి; చతురాననుండు = చతుర్ముఖ బ్రహ్మ {చతురాననుండు - చతుర (నాలుగు, 4) ఆననుండు (ముఖములు కలవాడు), బ్రహ్మదేవుడు};
జననము = జన్మమును; పొందెను = పొందెను; తత్ = ఆ; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించిన (పుట్టిన)వాడు, బ్రహ్మదేవుడు}; నామ = పేరు; రూప = రూపము; గుణ = గుణములు; ఆది = మొదలగు; సంజ్ఞ = గుర్తులతో; సమేతుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; నిర్మాణమున్ = నిర్మించుటను; ఒనరించెన్ = చేసెను; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును; వనజజుండు = బ్రహ్మదేవుడు {వనజజుడు - వనజము (పద్మము)న జన్మించినవాడు, బ్రహ్మదేవుడు}; నిజ = తన; ఛాయ = నీడ; వలనన్ = వలన; మఱియున్ = ఇంకనూ.

భావము:

నారాయణుడనే పేరుతో ప్రసిద్ధి కెక్కే పరబ్రహ్మం వెయ్యి దివ్యసంవత్సరాలు ఆ అండాన్ని అధిష్టించి ఉన్నాడు. ఆ వాసుదేవుని బొడ్డునుండి వేయి సూర్యుల కాంతితో వెలుగుతూ, సమస్త ప్రాణిసమూహంతో కూడిన ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి భగవదంశతో చతుర్ముఖ బ్రహ్మ పుట్టాడు. స్వయం ప్రకాశుడైన ఆ బ్రహ్మ నామ రూప గుణాలు అనే సంకేతాలు కలిగి సమస్త జగత్తులనూ సృష్టించాడు.