పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-719-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అవియును దమలోనఁ బ్రత్యేకంబ భువననిర్మాణకర్మంబునకు సమర్థంబులు గాక యన్నిటి సంఘాతంబునఁ బాంచభౌతికం బైన హిరణ్మయాండంబు సృజియించె; నదియును జలాంతర్వర్తియై వృద్ధిఁ బొందుచుండె; నంత.

టీకా:

అవియును = అవికూడ; తమ = తమ; లోనన్ = లోన; ప్రత్యేకంబ = ప్రత్యేకముగ; భువన = విశ్వ; నిర్మాణ = నిర్మించు; కర్మంబున్ = పని; కున్ = కి; సమర్థంబులు = సమర్థత కలవి; కాక = కాలేక; అన్నిటి = అన్నింటి; సంఘాతంబున్ = కలయిక వలన; పాంచభౌతికంబు = పంచభూతములచే తయారైనది; ఐన = అయినట్టి; హిరణ్మయాండంబు = హిరణ్మయాండమును {హిరణ్మ యాండము - హిరణ్య (బంగారము, గొప్పతనము) మయ (నిండిన) అండము (గుడ్డు)}; సృజియించెన్ = సృష్టించెను; అదియునున్ = అదికూడ; జల = నీటి; అంతర్ = లోపల; వర్తి = ఉండునది; ఐ = అయ్యి; వృద్ధిన్ = పెరుగుటను; పొందుచున్ = పొందుతూ; ఉండెన్ = ఉండెను; అంత = అంతట.

భావము:

ఆ పంచభూతాలలో ఏ ఒక్కదానికీ ప్రత్యేకంగా లోకాన్ని సృష్టించడం చేతకాక, అన్నీ ఒక గుంపుగా కలిసి పాంచభౌతికమైన ఒక బంగారు గ్రుడ్డును సృష్టించాయి. ఆ గ్రుడ్డు మహాజలాలలో తేలియాడుతూ వృద్ధి పొందుతూ ఉండగా...