పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవమనుష్యాదుల సృష్టి

  •  
  •  
  •  

3-718-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిన మునీంద్రుఁ డిట్లనియె "జీవాదృష్ట-
రుఁడు మాయాయుక్త పురుషవరుఁడుఁ
గాలాత్మకుఁడు నను కారణంబున నిర్వి-
కారుఁ డైనట్టి జన్నివాసుఁ
డాది జాతక్షోభుఁ య్యె నమ్మేటి వ-
నను గుణత్రయంబును జనించె
నా గుణత్రయము నం య్యె మహత్తత్త్వ-
ది రజోగుణహేతువైన దాని

3-718.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యం దహంకార మొగిఁ ద్రిగుణాత్మకమునఁ
బొడమె మఱి దానివలనఁ బ్రభూత మయ్యె
బంచతన్మాత్ర లందు సంవము నొందె
భూపంచక మీ సృష్టిహేతు వగుచు.

టీకా:

అనిన = అనగా; ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; జీవ = జీవులచే; అదృష్ట = చూడబడక; పరుడు = పైన ఉండువాడు; మాయా = మాయతో; యుక్త = కూడిన; పురుష = పురుషులలో; వరుడు = శ్రేష్ఠుడు; కాల = కాలమే; ఆత్మకుడు = స్వరూపము ఐనవాడు; అను = అనెడి; కారణంబునన్ = కారణములవలన; నిర్వికారుడు = మార్పులు లేనివాడు, శాశ్వతుడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; జగన్నివాసుడు = భగవంతుడు {జగన్నివాసుడు - జగత్ (లోకములకు) నివాసుడు (నివాసము అయిన వాడు), విష్ణువు}; ఆదిన్ = మొదటగా; జాత = పుట్టిన; క్షోభుడు = కదలికలు కలవాడు; అయ్యెన్ = ఆయెను; ఆ = ఆ; మేటి = గొప్పవాని; వలనను = వలన; గుణ = గుణముల {గుణత్రయము - త్రిగుణములు - సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు}; త్రయంబునున్ = మూడును; జనించెన్ = పుట్టినవి; ఆ = ఆ; గుణత్రయమున్ = త్రిగుణముల; అందున్ = లో; అయ్యెన్ = కలిగినది; మహత్తత్త్వము = మహత్తత్త్వము; అది = అది; రజోగుణ = రజోగుణము; హేతువు = కారణముగ కలది; ఐన = అయిన; దాని = దాని;
అందు = అందు; అహంకారము = అహంకారము; ఒగిన్ = క్రమముగ; త్రిగుణా = త్రిగుణములు; ఆత్మమున్ = కలదై; పొడమెన్ = పుట్టెను; మఱి = మరి; దాని = దాని; వలన = వలన; ప్రభూతము = పుట్టినవి; అయ్యెన్ = అయ్యెను; పంచతన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి)}; అందున్ = వానిలో; సంభవమున్ = పుట్టుట; పొందెన్ = పొందెను; భూతపంచకము = పంచభూతములు {భూతపంచకము - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి}; ఈ = ఈ; సృష్టి = సృష్టికి; హేతువు = కారణము; అగుచున్ = అవుతూ.

భావము:

ఆ విధంగా ప్రశ్నించిన విదురునితో మైత్రేయుడు ఇలా అన్నాడు “జీవులకు అగోచరుడూ, పురుషోత్తముడూ, యోగమాయా సమేతుడూ, కాలస్వరూపుడూ, నిర్వికారుడూ అయిన జగన్నివాసుడు ఆదికాలంలో సృష్టిని గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఆ ఆలోచనా ఫలితంగా సత్త్వం, రజస్సు, తమం అనే మూడు గుణాలు పుట్టాయి. ఆ మూడు గుణాలలో రజోగుణం నుండి మహత్తత్త్వం పుట్టింది. ఆ మహత్తత్త్వం నుండి మూడు గుణాల అంశలు కల అహంకారం పుట్టింది. ఆ అహంకారం నుండి పంచతన్మాత్రలు పుట్టాయి. వాటినుండి సమస్త సృష్టికి మూలకారణాలైన పంచభూతాలు పుట్టాయి.