పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతార విసర్జనంబు

  •  
  •  
  •  

3-716.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థి నెట్లు సృజించిరి ఖిలజగము
మెఱసి మఱి వారు భార్యాసమేతు లగుచు
నేమి సృజియించి; రదిగాక కామినులను
బాసి యేమి సృజించి; రా ద్రయశులు.

టీకా:

విమల = స్వచ్ఛమైన; ఆత్ముడు = మనసు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; విదురుండు = విదురుడు; మైత్రేయ = మైత్రేయుడు అను; ముని = మునులలో; వరున్ = శ్రేష్ఠుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమగా; చతుర = మంచినేర్పు కల; ఆత్మ = తెలివి కలవాడ; సకల = సమస్తమైన వానికిని; ప్రజాపతి = ప్రజాపతి; ఐన = అయిన; అట్టి = అటువంటి; జలజగర్భుడు = బ్రహ్మదేవుడు {జలజగర్భుడు - జలజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; ప్రజా = సంతానము; సర్గము = పొందుట; అందు = లో; మును = ముందుగ; ప్రజాపతులన్ = ప్రజాపతులను; పుట్టించి = సృష్టించి; వెండియున్ = మరల; చిత్తము = మనసు; అందు = లో; ఏమి = ఏమి; సృజింపన్ = సృష్టింపవలెనని; తలచె = అనుకొనెను; మును = ముందుగ; సృజించిన = సృష్టించిన; అట్టి = అటువంటి; మునుల్ = మునులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులు = మొదలైనవారు; అబ్జజున్ = బ్రహ్మదేవుని {అబ్జజుడు - అబ్జము (పద్మము)న జన్మించినవాడు, బ్రహ్మదేవుడు}; ఆదేశమున్ = ఆజ్ఞను; ఆత్మన్ = మనసున; నిలిపి = ఉంచుకొని; అర్థిన్ = కోరి; ఎట్లు = ఏవిధముగ; సృజియించిరి = సృష్టించిరి; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకమును; మెఱసి = ప్రకాశించి; మఱి = మరి; వారు = వారు; భార్యా = భార్యలతో; సమేతులు = కూడినవారు; అగుచున్ = అవుతూ; ఏమి = ఏమి; సృజియించిరి = సృష్టించిరి; కామినులను = స్త్రీలను; పాసి = లేకుండగ; ఏమి = ఏమి; సృజించిరి = సృష్టించిరి; భద్ర = శుభదృష్టి కల; యశులు = కీర్తిమంతులు.

భావము:

పవిత్రమైన మనస్సుగల ఆ విదురుడు మైత్రేయుణ్ణి చూచి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. “చాతుర్యం కల మనస్సు కల ఓ మహర్షీ! సమస్తసృష్టికీ కర్త అయిన బ్రహ్మ ప్రజాసృష్టి కోసం ముందుగా ప్రజాపతులను సృష్టించి, ఆ తర్వాత ఇంకా ఏమి సృష్టించాలనుకున్నాడు? ముందుగా సృష్టించిన మరీచి మొదలగు మునులు బ్రహ్మదేవుని ఆదేశానుసారం లోకాల నన్నిటినీ ఎలా సృష్టించారు? కీర్తివంతులైన ఆ ప్రజాపతులు భార్యలతో ఉన్నప్పుడు ఏమేమి సృష్టించారు? భార్యలను ఎడబాసిన తర్వాత ఏం సృష్టించారు?