పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతార విసర్జనంబు

  •  
  •  
  •  

3-712-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుయోగి పరీక్షిత్తున
కుటిలమతి నెఱుఁగఁ జెప్పె" ని సూతుఁడు శౌ
ముఖ్యులైన మునివరు
కుఁ దెలియగఁ జెప్పె మఱియు లాలనమొప్పన్.

టీకా:

శుక = శుకుడు అను; యోగి = యోగి; పరీక్షిత్తున్ = పరీక్షిత్తున; కున్ = కు; అకుటిల = వక్రతలులేని; మతిన్ = విధముగ; ఎఱుగన్ = తెలియ; చెప్పెను = చెప్పెను; అని = అని; సూతుడు = సూతుడు; శౌనక = శౌనకుడు; ముఖ్యులైన = మొదలగు; ముని = మునులలో; వరుల్ = శ్రేష్ఠుల; కున్ = కి; తెలియగన్ = తెలియునట్లు; చెప్పెన్ = చెప్పెను; మఱియున్ = ఇంకనూ; లాలనము = బుజ్జగించుచున్న ధోరణి; ఒప్పన్ = ఒప్పగా.

భావము:

శుకయోగి​ పరీక్షిత్తుకు మంచిమనస్సుతో వినిపించాడని సూతుడు శౌనకాది మునులకు చక్కగా తెలియ జెప్పాడు.​​