పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతార విసర్జనంబు

  •  
  •  
  •  

3-710-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిగె వికుంఠధామమున మ్మహితోత్సవసూచకంబుగా
మొసె సుపర్వదుందుభు లమోఘములై ధరణీతలంబునం
గురిసెఁ బ్రసూనవృష్టి శిఖికుండము లెల్లెడఁ దేజరిల్లె భా
స్కశశిమండలంబులు నిద్యుతితో వెలుగొందె నత్తఱిన్. "

టీకా:

అరిగెన్ = వెళ్ళెను; వికుంఠ = వైకుంఠ; ధామమున్ = పురమున; కున్ = కి; ఆ = ఆ; మహిత = గొప్ప; ఉత్సవ = వేడుకను; సూచకంబుగా = సూచిస్తున్నట్లుగా; మొరసెన్ = మోగినవి; సుపర్వ = దేవతల; దుందుభులు = పెద్దపెద్ద డోళ్ళు; అమోఘములు = అమోఘములు; ఐ = అయ్యి; ధరణీ = భూ; తలంబునన్ = మండలమున; కురిసెన్ = కురిసెను; ప్రసూన = పూల; వృష్టి = వాన; శిఖి = (యజ్ఞములందలి) అగ్ని; కుండములు = గుండములు; ఎల్లెడలన్ = అన్నిచోట్ల; తేజరిల్లెన్ = తేజోవంతమాయెను; భాస్కర = సూర్య; శశి = చంద్ర; మండలములున్ = మండలములు; నిజ = సహజ; ద్యుతి = కాంతి; తోన్ = తో; వెలుగొందెన్ = ప్రకాశించెను; ఆతఱిన్ = అప్పటినుండి.

భావము:

వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందుభులు అమోఘంగా మ్రోగాయి. భూమిపైన పూలవాన కురిసింది. అంతటా హోమకుండాలు అగ్నులతో తేజరిల్లాయి. సూర్యమండలం, చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి.